నువ్వే నువ్వే...
నువ్వే కావాలి...
నవ వసంతం...
నువ్వు లేక నేను లేను...
హీరోగా తరుణ్ (Hero Tarun) నటించిన సినిమాల్లో ఓ నాలుగు సినిమాలు ఇవి! వాటిలో తరుణ్ ఓ సినిమా ముందు, మరో సినిమా వెనుక చేసి ఉండొచ్చు. కానీ, తరుణ్ పేరు చెబితే ఈ నాలుగు సినిమాలు తప్పకుండా గుర్తు వస్తాయి. ప్రేక్షకుల హృదయాల్లో మంచి అనుభూతి మిగిల్చిన సినిమాల్లో ఈ నాలుగూ ఉంటాయి. సెంచరీ స్టార్టింగ్‌లో సాలిడ్ సక్సెస్ అందుకున్న సినిమాల లిస్టు తీస్తే... అందులో 'నువ్వే కావాలి' తప్పకుండా ఉంటుంది.
'నువ్వే కావాలి' పాటలు, సినిమా ఓ సంచనలం. అప్పట్లో యువతను ఓ ఊపు ఊపేశాయి. తెలుగునాట ఏ ఊరు చూసినా.... ఏ నోట విన్నా... 'అనగనగా ఆకాశం ఉంది' పాట కొన్నాళ్లు వినిపించింది. అప్పటికే బాల నటుడిగా తరుణ్ అవార్డులు, రివార్డులు అందుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాలు చేశారు. 'అంజలి', బాలకృష్ణ 'ఆదిత్య 369' సినిమాలు అతడికి మంచి పేరు తీసుకొచ్చాయి. అయితే... హీరోగా 'నువ్వే కావాలి' అంతకు మించి పేరు తీసుకొచ్చింది.
మాస్‌లో మాంచి ఫాలోయింగ్ రావాలంటే కమర్షియల్ సినిమాలు చేయాలనేది ఇండస్ట్రీ నమ్మే ఫార్ములా. కానీ, ప్రేమకథలతో - ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో మాంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న అతి తక్కువ మంది హీరోల్లో తరుణ్ ఒకరు. 'నువ్వే కావాలి' తర్వాత యూత్‌లో ఆయన అంటే విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. యూత్ బేస్డ్ ఫిల్మ్స్ చేశారు. లవర్ బాయ్ అంటే తరుణ్... తరుణ్ అంటే లవర్ బాయ్... అన్నంతగా ముద్ర పడింది. తరుణ్‌కు ప్రేమలేఖలు రాసిన అమ్మాయిలు కూడా ఉన్నారు.
'నువ్వే కావాలి' (2000) నుంచి 'శశిరేఖా పరిణయం' (2009) వరకు తరుణ్ జోరుగా సినిమాలు చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా ఆయన వేగం తగ్గింది. 'శశిరేఖా పరిణయం' నుంచి ఇప్పటివరకూ ఆయన చేసిన సినిమాలు నాలుగంటే నాలుగే. తరుణ్ సినిమా (ఇది నా లవ్ స్టోరీ) వచ్చి నాలుగేళ్లు అవుతోంది. తరుణ్‌ను అభిమానించే వారితో పాటు సగటు ప్రేక్షకుల్లో ఒక్కటే సందేహం... 'తరుణ్ ఎందుకు సినిమాలు చేయడం లేదు?' అని!
హీరోగా తరుణ్ ఖాతాలో విజయాలు ఉన్నాయి. తనను తాను ఆయన ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నారు. నటుడిగా తరుణ్‌కు వంక పెట్టడానికి లేదు. మంచి అందగాడు కూడా! ఇండస్ట్రీలో అతడిని అభిమానించే వారు ఉన్నారు. ఇండస్ట్రీలో పేరున్న దర్శక, నిర్మాతలతో అతనికి పరిచయాలు ఉన్నాయి. త్రివిక్రమ్, కృష్ణవంశీ, 'స్రవంతి' రవికిశోర్, డి. సురేష్ బాబు తదితరులతో ఆయన గతంలో సినిమాలు చేశారు. విజయాలు అందుకున్నారు. మరి, ఇప్పుడు ఎందుకు సినిమాలు చేయడం లేదు? అంటే... ఠక్కువ సమాధానం చెప్పడం కష్టమే. వివిధ కారణాలు ఉండొచ్చు. అయితే... ఆ బ్రేక్ అనుకోకుండా అలా అలా కంటిన్యూ అయ్యింది. బ్రేక్ టైమ్‌లో టాలీవుడ్‌లో కథలు, సినిమాల పరంగా మార్పులు చోటు చేసుకున్నాయి. కొందరు కొత్త హీరోలు వచ్చారు. స్టార్స్ అయ్యారు. అయితే... తరుణ్ అంటే ఇప్పటికీ కొందరిలో అభిమానం ఉంది. వారందరూ కోరుకునేది ఒక్కటే... సరైన సినిమాతో తరుణ్ రీ ఎంట్రీ ఇవ్వాలని! సాలిడ్ హిట్ పడితే... తరుణ్ జోరు మళ్లీ మొదలు అవుతుందని! వచ్చే ఏడాది పుట్టినరోజు లోపు తరుణ్ మంచి హిట్ సినిమాతో మళ్లీ మన ముందుకు వస్తారని, రావాలని ఆశిద్దాం! ఆశిస్తూ... ABP దేశం తరఫున తరుణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Wishing Tarun a very Happy Birthday - ABP Desam
Also Read: మగాళ్లకు మంచి టిప్... అదీ పెళ్లి తర్వాత భార్యతో బాలకృష్ణ చేసుకున్న అగ్రిమెంట్!
Also Read: సౌత్ ఇండియాలో మరో స్టార్ హీరోయిన్‌కు కరోనా... న్యూ ఇయర్ కంటే ముందే!
Also Read: చచ్చిపోతా, మంట పెట్టేస్తారనుకున్నా - రాజశేఖర్ భావోద్వేగం... జీవిత కన్నీరు
Also Read: ఏపీలో సినిమా వ్యాపారానికి మరో దెబ్బ... కొత్త సినిమాలకు కలెక్షన్లు రావడం కష్టమే!
Also Read: 'అతిథి దేవో భవ' రివ్యూ: ప్రేక్షకుల్ని అతిథుల్లా చూశారా? లేదా?
Also Read: ఏడిస్తే కష్టం పోతుందా? - దీప్తి సునయన లేటెస్ట్ పంచ్! బ్రేకప్ బాధ నుంచి బయటకొస్తోందా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.