కోవిడ్ బూస్టర్ డోస్ కోసం ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమవుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే కొత్త రిజిస్ట్రేషన్ అవసరం లేదని పేర్కొంది. 


"రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు నేరుగా అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు లేదా ఏదైనా కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌కి వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ సదుపాయం రేపు సాయంత్రం నుంచి ప్రారంభమవుతుంది. జనవరి 10 నుంచి ఆన్-సైట్ అపాయింట్‌మెంట్‌తో పాటు వ్యాక్సినేషన్ ప్రారంభవుతుంది" ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.


Also Read: ఇటలీ నుంచి వచ్చిన మరో 173 మందికి కరోనా.. 15 మంది జంప్!


హెల్త్‌కేర్ (హెచ్‌సీడబ్ల్యులు), ఫ్రంట్‌లైన్ వర్కర్లు (ఎఫ్‌ఎల్‌డబ్ల్యులు), అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 60 ఏళ్లకు పైబడిన వారికి జనవరి 10 నుంచి బూస్టర్ డోస్ అందిస్తారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బూస్టర్ డోస్‌కు అర్హత పొందాలంటే, రెండో డోస్‌ను తీసుకుని తొమ్మిది నెలలు లేదా 39 వారాలు గడిచి ఉండాలి. మొదటి రెండు డోసులు ఇచ్చిన కోవిడ్-19 వ్యాక్సిన్‌నే మూడో డోస్ లో ఇస్తామని కేంద్రం తెలిపింది. సీనియర్ సిటిజన్లు ప్రికాషనరీ డోస్ తీసుకునే సమయంలో వైద్యుల సర్టిఫికేట్లు సమర్పించాల్సిన అవసరం లేదని కేంద్రం వెల్లడించింది.


Also Read: Covid Cases Today: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజులో అక్షరాల లక్ష కేసులు






"బూస్టర్ డోస్ తీసుకునే ముందు దీర్ఘకాలిక వ్యాధులతో బాధతున్న సీనియర్ సిటిజన్లు వైద్యలు సలహాలు పొందాలని సూచిస్తున్నాం" అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్-19 టీకా ప్లాట్‌ఫారమ్ CoWIN ప్రికాషనరీ డోస్ కు అర్హులైన వారికి రిమైండర్ మెసేజ్ లు పంపుతుంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత టీకా సర్టిఫికేట్‌లో ప్రికాషనరీ డోస్ వివరాలు నమోదవుతాయి. ప్రభుత్వ డేటా ప్రకారం 60 సంవత్సరాల కన్నా ఎక్కువ వయస్సు ఉన్నవారిలో 137.5 మిలియన్ల మంది బూస్టర్ డోస్ కు అర్హులు. 






Also Read: DigiLocker: యూనివర్సిటీలకు UGC కీలక ఆదేశాలు.. ఇక ఆ సర్టిఫికెట్లకు చెల్లుబాటు


Also Read: Covid Updates: తెలంగాణలో పెరుగుతున్న కరోనా ఉద్ధృతి... ఒక్క రోజులో 2 వేలకు పైగా కేసులు, ముగ్గురు మృతి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి