యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక ప్రకటన చేసింది. డిజీలాకర్ ద్వారా పొందే విద్యార్హత మార్కు షీట్లను చట్టబద్ధమైన పత్రాలుగా పరిగణించాలని తెలిపింది. ఈ మేరకు కళాశాలలు వాటిని గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పలు రాష్ట్ర, కేంద్ర విద్యా బోర్డులు డిజిటల్ డాక్యుమెంట్లనే అందిస్తున్నాయి.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సహా పలు విశ్వవిద్యాలయాలు, ఉన్న విద్యా సంస్థలు.. సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లను డిజిటల్ రూపంలోనే అందిస్తున్నాయి.
నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (NAD) అనేది డిజిటల్ ఫార్లెట్లో అకడమిక్ డాక్యుమెంట్లను అందించే ఆన్‌లైన్ స్టోర్ హౌస్. డిజీలాకర్, NAD సహకారంతో డిజిటల్ డాక్యుమెంట్లను పొందేలా చూడాలని యూజీసీకి విద్యా మంత్రిత్వశాఖ ఆదేశించింది. భౌతికంగా వచ్చి సర్టిఫికెట్లు తీసుకో అక్కర్లేకుండా ఎక్కడి నుంచైనా డిజిటిల్ సర్టిఫికెట్లు పొందేలా విద్యార్థులకు నేషనల్ అకడమిక్ డిపాజిటరీ ఉపయోగపడుతుందని విద్యాశాఖ తెలిపింది.
డిజీలాకర్ అంటే?
ప్రస్తుత కాలంలో మన గుర్తింపు మనం భౌతికంగా ఉన్నప్పటికీ, డాక్యుమెంట్స్ రూపంలో ఉంటేనే దానికి విలువ ఉంటోంది. ముఖ్యంగా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్ బుక్, ఇలా ప్రతీ ఒక్క డాక్యుమెంట్ చాలా ముఖ్యమే. అయితే మనకు ఎంతో అవసరం అయిన కీలకమైన డాక్యుమెంట్లను భౌతిక రూపంలో ఎప్పుడూ వెంట ఉంచుకోవడం ఎవరికైనా కష్టమే. ఇలాంటి సమస్యలకు పరిష్కారమే డిజీలాకర్. దీంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. విలువైన పత్రాలను ఎక్కడి నుంచైనా ఏ సమయంలోనైనా డిజీలాకర్‌లోకి అప్‌లోడ్‌చేసి భద్రంగా దాచుకోవచ్చు. ఎలక్ట్రానిక్-డాక్యుమెంట్ల రూపంలో వీటిని ఎప్పుడూ మీ వెంటే ఉంచుకోవచ్చు. ఒరిజినల్స్‌తో సమానంగా ఇవి చెల్లుబాటు అవుతాయి. వీటిని ఎప్పుడు కావలంటే అప్పుడు.. ఎలా కావాలంటే అలా ఉపయోగించుకునేందుకు వీలుంటుంది.
దీనిని 2015 జులైలో ప్రారంభించారు. దీనిలో, వినియోగదారు 1GB ప్రత్యేక డిజిటల్ స్పేస్ పొందుతారు, దీనిలో మీకు అవసరమైన పత్రాలను సురక్షితంగా దాచుకోవచ్చు. ఇది ఆధార్‌తో అనుసంధానమై ఉంటుంది.
తమ డ్యాకుమెంట్లను డిజిటల్ రూపంలో పొందేందుకు విద్యార్థులు డిజీలాకర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని లేదా digilocker.gov.inలో రిజిస్టర్ కావాలి.
Also Read: Covid Cases Today: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజులో అక్షరాల లక్ష కేసులు