దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఒక్కరోజులో కొత్తగా లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1,17,100 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 302 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. 30,836 మంది కరోనా నుంచి కోలుకున్నారు.





      • డైలీ పాజిటివిటీ రేటు: 7.74%.

      • యాక్టివ్ కేసులు: 3,71,363

      • మొత్తం రికవరీలు: 3,43,71,845

      • మొత్తం మరణాలు: 4,83,178 

      • మొత్తం వ్యాక్సినేషన్: 154.32 కోట్లు
















ఒమిక్రాన్ కేసులు..


దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 3007కు చేరింది. 








ముంబయి..


ముంబయిలో అత్యధికంగా ఒక్కరోజులో 20,181 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8,53,809కి చేరింది. నలుగురు మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 16,388కి పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 79,260కి చేరింది.


ముంబయిలో పాజిటివిటీ రేటు 29.90కు పెరిగినట్లు బీఎంసీ పేర్కొంది. తాజాగా 67 వేల శాంపిళ్లను పరీక్షించగా 20,181 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది.


దిల్లీలో..


దిల్లీలో గురువారం కొత్తగా 15,097 కరోనా కేసులు నమోదుకాగా ఆరుగురు మృతి చెందారు. 6,900 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2021 మే 8 నుంచి దిల్లీలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. యాక్టివ్ కేసుల సంఖ్య 31,498కి పెరిగింది. పాజిటివిటీ రేటు 15.34గా ఉంది.


డబ్ల్యూహెచ్ఓ..


కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరణాలు పెరుగుతుండటంతో ప్రపంచ దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అలర్ట్ చేసింది. గతంలో భావించిన తరహాలో ఒమిక్రాన్‌ను చిన్న సమస్యలా కొట్టిపారేయవద్దని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రియోసస్ హెచ్చరించారు. ఒమిక్రాన్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోందని, పరిస్థితి గమనిస్తే గతంలో డేల్టా వేరియంట్ కేసుల్ని గుర్తుచేస్తోందన్నారు. ఒమిక్రాన్ సోకడంతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోందని, కరోనా పాజిటివిటీ పెరిగినట్లు వెల్లడించారు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి