ఇటలీ నుంచి పంజాబ్ అమృత్‌సర్‌ వచ్చిన విమానంలో 173 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న ఇటలీ నుంచే వచ్చిన ఓ విమానంలో 125 మందికి కొవిడ్ నిర్ధారణైంది.


రోమ్ నుంచి అమృత్‌సర్‌లోని శ్రీ గురు రామ్‌దాస్ విమానాశ్రయానికి వచ్చిన విమానంలో మొత్తం 285 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరికి పరీక్షలు చేయగా 173 మందికి కొవిడ్ ఉన్నట్లు తేలింది. వీరందరినీ నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే టెస్ట్‌లు కొనసాగుతున్నాయని పాజిటివ్ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అన్నారు.




 



హై డ్రామా..


అయితే గురువారం పాజిటివ్ వచ్చిన 15 మంది ప్రయాణికులు ఆసుపత్రి నుంచి పారిపోయినట్లు సమాచారం. ఇటలీ ఇప్పటికే ఆందోళనకర దేశాల జాబితాలో ఉంది. అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేసింది.


తాజా మార్గదర్శకాలు..


విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు 7 రోజుల పాటు హోం క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కొవిడ్ సహా ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలను కేంద్రం కట్టుదిట్టం చేసింది. ఈ నెల 11 నుంచి ఆదేశాలు అమలులోకి రానున్నట్లు తెలిపింది.


నిబంధనలు ఇవే..



  • కరోనా ముప్పు ఎక్కువ ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్ టెస్ట్‌లు తప్పనిసరి.

  • ఫలితాల్లో నెగటివ్​ వస్తే వారు ఏడు రోజుల పాటు హోంక్వారంటైన్​లో ఉండాలి.

  • ఎనిమిదవ రోజు మరోసారి టెస్ట్​ చేయించుకోవాలి. ఆ ఫలితాలను ప్రయాణికులు ఎయిర్​ సువిధా పోర్టల్​లో అప్​లోడ్​ చేయాలి.

  • టెస్ట్​లో నెగటివ్​ వస్తే 7 రోజుల పాటు స్వీయ పర్యవేక్షణలో ఉండాలి.

  • ఒకవేళ పాజిటివ్​ వస్తే అధికారులు వారిని ఐసోలేషన్​కు తరలించి చికిత్స అందిస్తారు.


Also Read: DigiLocker: యూనివర్సిటీలకు UGC కీలక ఆదేశాలు.. ఇక ఆ సర్టిఫికెట్లకు చెల్లుబాటు


Also Read: Covid Cases Today: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజులో అక్షరాల లక్ష కేసులు







ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి