కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ మరో కీలక మైలురాయిని చేరింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 150 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కోల్‌కతాలోని చిత్తరంజన్ నేషనల్ కేన్సర్ ఇన్స్‌స్టిట్యూట్ రెండో క్యాపస్ను వర్చువల్ విధానంలో మోదీ ప్రారంభించారు. ఈ సందర్బంగా వ్యాక్సినేషన్‌పై మాట్లాడారు.
దేశంలో అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కోసం ఉన్న 90 వేల మెడికల్ సీట్లకు అదనంగా మరో 60 వేల సీట్లను 2014 నుంచి పెంచినట్లు ప్రధాని మోదీ అన్నారు.
పెరుగుతోన్న కేసులు..
ఒక్కరోజులో కొత్తగా లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1,17,100 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 302 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. 30,836 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 3007కు చేరింది.
Also Read: DigiLocker: యూనివర్సిటీలకు UGC కీలక ఆదేశాలు.. ఇక ఆ సర్టిఫికెట్లకు చెల్లుబాటు
Also Read: Covid Cases Today: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజులో అక్షరాల లక్ష కేసులు