సినిమా సెలబ్రెటీలైనా... సామాన్యులైనా... కరోనాకు ఒక్కటే. మహమ్మారి వైరస్ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. చాలా మందిని చావు అంచుల వరకూ వెళ్లి బయటపడ్డారు. అందులో హీరో రాజశేఖర్ కూడా ఒకరు. ఆయ‌న‌తో పాటు కుటుంబ సభ్యులు సైతం కరోనా బారిన పడ్డారు. కుమార్తెలు శివాని, శివాత్మిక చాలా త్వరగా కరోనా నుంచి బయట పడ్డారు. రాజ‌శేఖ‌ర్‌కు మాత్రం సీరియస్ అయ్యింది. ఆయన చాలా రోజుల ఐసీయూలో ఉన్నారు. అప్పటి పరిస్థితి గురించి తాజాగా ఓ టాక్ షోలో వివరించారు.


'ఆలీతో సరదాగా' టాక్ షోకు రాజశేఖర్, జీవిత దంపతులు అతిథులుగా వచ్చారు. ఓ వారంలో 'శేఖర్' సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందనగా... రాజ‌శేఖ‌ర్‌కు కరోనా వచ్చింది. అప్పుడు ఆయన ఓ నెల ఐసీయూలో ఉన్నారని జీవిత వెల్లడించారు. "సీరియస్ అయ్యి... మనం చచ్చిపోతాం. రేపో, ఎల్లుండో మనల్ని మంట పెట్టేస్తారని అనుకున్నా" అని రాజశేఖర్ చెప్పారు. ఆయన మాటలకు కొనసాగింపుగా "(పరిస్థితి) అలాగే ఉండింది" అని జీవిత అన్నారు. చెబుతూ చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. 'ఆలీతో సరదాగా' టాక్ షోలో ఇద్దరూ భావోద్వేగానికి లోనయ్యారు.


హీరోలు, సినిమా సెలబ్రిటీలు తమకు ఉన్న ప్రాబ్లమ్స్ గురించి గతంలో ప‌బ్లిక్‌గా చెప్పేవారు కాదు. కానీ, ఇటీవల మార్పు వచ్చింది. తమ ప్రాబ్లమ్స్ ఏంటో చెబుతున్నారు. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కూడా అలాగే చెప్పారు. 'మీరు డాక్టర్ చదివారు కదా! ఎందుకు యాక్టర్ అవ్వాలని వచ్చారు?' అని రాజ‌శేఖ‌ర్‌ను ఆలీ ప్ర‌శ్నించారు.  ''ఎప్పుడు ఎగ్జామ్స్ కోసం చదువుతానో... అప్పుడు యాక్టర్ అవ్వాలని ఎక్కువ అనిపించేది. తర్వాత నాకు నత్తి. దర్శకుడినో, నిర్మాతనో కలిసి నాకు అవకాశం ఇవ్వమని అడిగిన తర్వాత, నత్తి వల్ల తీసేస్తే... చాలా అసహ్యం అయిపోతుందేనని ఆలోచించాను" అని రాజశేఖర్ బదులు ఇచ్చారు. తన ప్రాబ్లమ్ గురించి ప‌బ్లిక్‌గా ఓపెన్ అయ్యారు. వారసుడి గురించి, అమ్మాయిల గురించి కూడా షోలో ఆయన మాట్లాడారు.


Also Read: ఏపీలో సినిమా వ్యాపారానికి మరో దెబ్బ... కొత్త సినిమాలకు కలెక్షన్లు రావడం కష్టమే!
Also Read: 'అతిథి దేవో భ‌వ‌' రివ్యూ: ప్రేక్ష‌కుల్ని అతిథుల్లా చూశారా? లేదా?
Also Read: ఏడిస్తే కష్టం పోతుందా? - దీప్తి సునయన లేటెస్ట్ పంచ్! బ్రేకప్ బాధ నుంచి బయటకొస్తోందా?
Also Read: మహేష్ నుంచి త‌మ‌న్‌కు... త‌మ‌న్ నుంచి ఎవ‌రికి? నెక్స్ట్ ఎవరు??
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.