కరోనా మూడో దశ ముందు హిందీ సినిమా ఇండస్ట్రీని తాకింది. కరీనా కపూర్ ఖాన్, అమృతా అరోరా, అర్జున్ కపూర్, జాన్ అబ్రహం దంపతులు, నోరా ఫతేహి, స్వరా భాస్కర్ తదితరులకు కొవిడ్ 19 పాజిటివ్ అని తేలింది. అయితే... తెలుగు సినిమా ఇండస్ట్రీపై పెద్ద ప్రభావం ఉండదని అనుకున్నారంతా! వారం ముందు వరకూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు ఎవరికీ కరోనా సోకలేదు. దాంతో అందరూ హ్యాపీగా ఉన్నారు. అనూహ్యంగా ఇప్పుడు టాలీవుడ్‌లో కరోనా కలకలం మొదలు అయ్యింది. మంచు మనోజ్ తనకు కరోనా అని ప్రకటించారు. ఆ తర్వాత ఆయన సోదరి, నటి లక్ష్మీ మంచు సైతం కరోనా బారిన పడ్డారు. అయితే... సూపర్ స్టార్ మహేష్ బాబుకు కరోనా అని తెలిసిన తర్వాత ఇండస్ట్రీలో కంగారు మొదలు అయ్యింది.మహేష్ బాబు దుబాయ్ నుంచి వచ్చారు. అక్కడ సోకిందో? లేదంటే ప్రయాణంలో ఆయనకు సోకిందో? మొత్తం మీద మహేష్ కరోనా బారిన పడ్డారు. దుబాయ్‌లో మహేష్‌ను దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు తమన్, నిర్మాత నాగవంశీ కలిశారు. త్రివిక్రమ్ సినిమా మాత్రమే కాదు, దానికి ముందు మహేష్ చేస్తున్న 'సర్కారు వారి పాట'కు కూడా తమనే సంగీతం అందిస్తున్నారు. 'సర్కారు వారి పాట' సినిమా దర్శకుడు పరశురామ్‌తో దిగిన ఫొటోను గురువారం తమన్ ట్వీట్ చేశారు. మరుసటి రోజు, మహేష్ బాబు తనకు కరోనా అని వెల్లడించిన మరుసటి రోజు... శుక్రవారం తమన్‌కు కరోనా అని తేలింది. ఆయన అసిస్టెంట్‌కు కూడా కరోనా అట.Also Read: 'అతిథి దేవో భవ' రివ్యూ: ప్రేక్షకుల్ని అతిథుల్లా చూశారా? లేదా?ఇప్పుడు తమన్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. సంక్రాంతి బరిలో విడుదలకు రెడీ అయిన 'డీజే టిల్లు'కు ఆయన రీ-రికార్డింగ్ చేస్తున్నారు. ఆ సినిమా పనుల మీద టీమ్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. తమిళ హీరో శివ కార్తికేయన్, జాతి రత్నం నవీన్ పోలిశెట్టి, దర్శకుడు కెవి అనుదీప్‌ను బుధవారం తమన్ కలిశారు. శివ కార్తికేయన్, అనుదీప్ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అందువల్ల, రీసెంట్‌గా తమన్‌ను ఎవరెవరు కలిశారు? ఆ కలిసిన వాళ్లు ఎవరెవరిని కలిశారు? అన్నది హాట్ డిస్కషన్ పాయింట్ అవుతోంది. ఒకవేళ మహేష్ నుంచి తమన్‌కు వచ్చిందని అనుకున్నా... అనుకోకపోయినా... తమన్ నుంచి ఎవరికి కరోనా అంటుకుంది? అక్కడ నుంచి ఎవరి దగ్గరకు వెళుతుంది? అనేది పాయింట్.Also Read: నితిన్ భార్యకు కోవిడ్.. ఆమె బర్త్‌డేను ఎలా సెలబ్రేట్ చేశాడో చూడండినిజం చెప్పాలంటే... కరోనా విషయంలో తమన్ తీసుకున్న జాగ్రత్తలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకొకరు తీసుకోలేదంటే అతిశయోక్తి కాదు. గత ఏడాది 'వకీల్ సాబ్' ఫంక్షన్స్‌లో, ఆ తర్వాత ఆయన ఎప్పుడూ మాస్క్‌లో కనిపించారు. ఇక, శానిటైజర్లు ఇతరత్రా కేర్ గురించి ఆయన్ను దగ్గరగా చూసిన జనాలకు తెలుసు. ఎంతో జాగ్రత్త తీసుకున్న తమన్‌కు కరోనా రావడం ఇండస్ట్రీలో జనాలకు కూడా షాకింగ్ న్యూస్. నెక్స్ట్ ఎవరు కరోనా అని వెల్లడిస్తారో? దేవుడి దయ వల్ల కరోనా బారిన ఇంకెవరూ పడకూడదని ఆశిద్దాం!Also Read: షూటింగ్ క్యాన్సిల్.. ఇంట్లోనే చిల్ అవుతోన్న రౌడీ హీరో..ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
Corona - Tollywood Celebs: మహేష్ నుంచి తమన్‌కు... తమన్ నుంచి ఎవరికి? నెక్స్ట్ ఎవరు??
ABP Desam | 07 Jan 2022 02:56 PM (IST)
కరోనా బారిన పడిన తెలుగు సినీ ప్రముఖుల జాబితాలో ఒక్కొక్కరూ చేరుతున్నారు. దాంతో నెక్స్ట్ ఎవరు? అనే క్వశ్చన్ మొదలైంది.
Thaman_and_Mahesh_Babu