సినిమా రివ్యూ: అతిథి దేవో భ‌వ
రేటింగ్: 1.5/5
నటీనటులు: ఆది సాయి కుమార్‌, నువేక్ష‌, రోహిణి, స‌ప్త‌గిరి తదితరులు 
క‌థ‌: వేణుగోపాల్ రెడ్డి
సినిమాటోగ్రఫీ: అమ‌ర్‌నాథ్ బొమ్మిరెడ్డి
సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌
నిర్మాతలు: రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల 
దర్శకత్వం: పొలిమేర నాగేశ్వ‌ర్‌ 
విడుదల తేదీ: 07-01-2022


జనవరి 7... ఈ రోజు 'ఆర్ఆర్ఆర్' విడుదలవుతుందని ఆడియన్స్ ఎంతో ఎదురు చూశారు. అయితే... ఒమిక్రాన్, కరోనా వైరస్ అంతా తల్లకిందులు చేసింది. 'ఆర్ఆర్ఆర్' విడుదల వాయిదా పడడంతో ఆది సాయి కుమార్ 'అతిథి దేవో భవ' విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉంది?
కథ: అభి... అభయ్ రామ్ (ఆది సాయి కుమార్)కు మోనో ఫోబియా. ఒంటరితనం అంటే భయం. ఎక్కడికీ ఒంటరిగా వెళ్లలేడు. ఎవరో ఒకరిని తోడు తీసుకు వెళతాడు. ఎప్పుడూ స్నేహితుడిని తోడు తీసుకు వస్తున్నాడని ఓ అమ్మాయి బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత అతడి జీవితంలోకి మరో అమ్మాయి వైష్ణవి (నువేక్ష) వస్తుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. తన సమస్యను ఆ అమ్మాయికి అభయ్ చెప్పాడా? లేదా? వైష్ణవికి అభయ్ ఎక్స్ లవర్ గురించి తెలిసిందా? తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యింది? అభయ్ ఫ్లాట్ కి వచ్చిన ప్రియ ఎవరు? ఆమె వల్ల అభయ్ జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయి? ఏ సమస్య వచ్చింది? మోనో ఫోబియాను అభయ్ ఎలా అధిగమించాడు? చివరకు ఏం అయ్యింది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ: హీరోకి మతిమరుపు ఉంటే ఎలా ఉంటుంది? ఈ కాన్సెప్ట్ తీసుకుని దర్శకుడు మారుతి 'భలే భలే మగాడివోయ్' సినిమాలో మంచి వినోదం పండించారు. ఒకవేళ హీరోకి అతి శుభ్రత (ఓసీడీ) ఉంటే? 'మహానుభావుడు' అంటూ మరో సినిమా తీశారు. హీరో లోపాన్ని ఆ రెండు సినిమాలు వినోదాత్మకంగా చూపించాయి. హీరోకి ఏదో ఒక లోపం ఉండటం... ఆ నేపథ్యంలో కొన్ని థ్రిల్లర్ - హారర్ సినిమాలు కూడా వచ్చాయి. 'అతిథి దేవో భవ' ఏ జానర్ సినిమా అంటే... తొలి గంట ప్రేక్షకుల్ని నవ్వించాలని, ఇంటర్వెల్ తర్వాత కాసేపు థ్రిల్ ఇవ్వాలని ట్రై చేశారు. అలాగని, ఇది థ్రిల్లర్ కాదు... సినిమాను సాగదీయడం కోసం వేసిన ఓ ఎత్తుగడ. ఆ ఒక్క ఎపిసోడ్ మాత్రమే కాదు, సినిమా మొత్తం సాగదీసినట్టు ఉంటుంది. సప్తగిరితో తీసిన కామెడీ ఎపిసోడ్స్ ఏవీ వర్కవుట్ అవ్వలేదు. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ఒక సన్నివేశంలో కనిపించారు. అది కూడా ఏమీ నవ్వించలేదు. సినిమాలో ట్విస్టులు, టర్నులు ఏమంత ఆసక్తి కలిగించలేదు. కామెడీ సీన్స్ నవ్వించలేదు.
Also Read: 'సేనాపతి' రివ్యూ: రాజేంద్ర ప్రసాద్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా?
సినిమా మొత్తం మీద సిద్ శ్రీరామ్ పాడిన 'బాగుంటుంది నువ్వు నవ్వితే' పాట బాగుంది. తొలి పాట 'నిన్ను చూడగానే', ఎమోషనల్ సాంగ్ 'చిన్ని బొమ్మ నన్నిలా...' పర్లేదు. బాగున్నాయి. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర తన వరకు న్యాయం చేశారు. సినిమాలో ఫైట్స్ ఇంపార్టెన్స్ ఏమీ లేదు. అయితే... ఆ రెండు మూడు యాక్షన్ సీన్స్ పర్లేదు. ఉన్నంతలో బాగా తీశారు. ఆర్ట్ వర్క్ నీట్ గా ఉంది.
Also Read: '83' మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
ఆది సాయి కుమార్ పాత్రకు న్యాయం చేయడానికి ట్రై చేశారు. తనదైన శైలిలో నటించారు. కొత్తగా ఏమీ అనిపించలేదు. హీరోయిన్ నువేక్ష అందంగా కనిపించారు. అభినయం పరంగానూ బాగా చేశారు. ఆది సాయి కుమార్ తల్లి పాత్రలో రోహిణి అద్భుతంగా నటించారు. ఆమె గతంలో ఇటువంటి పాత్రలు చేశారు. అయినా... మరోసారి రోహిణి నటన ఆకట్టుకుంటుంది. ముందుగా చెప్పినట్టు సప్తగిరి, ఇమ్మాన్యుయేల్, అదుర్స్ రఘు నవ్వించలేదు. ఒకవేళ సినిమాలో కామెడీ వర్కవుట్ అయ్యి ఉంటే... బాగుండేది ఏమో! కామెడీ లేక... సరైన డైరెక్షన్, ట్రీట్మెంట్ లేక... సినిమా బోరింగ్ గా మారింది.
Also Read:'అర్జున ఫల్గుణ' రివ్యూ: అర్జునుడు బలయ్యాడా? బతికాడా?
Also Read: 'శ్యామ్ సింగ రాయ్' రివ్యూ: తిరగబడిన సంగ్రామమా? ఎగసిపడిన అలజడా?
Also Read:'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు' రివ్యూ: సినిమా ఎలా ఉంది?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి