ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. జనవరి మొదటి వీకెండ్ లో మొత్తం ఐదు సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. అందులో ఆది సాయి కుమార్ నటించిన 'అతిథి దేవో భవ', రానా నటించిన '1945' సినిమాలపై కాస్త బజ్ ఏర్పడింది. కానీ ఈ రెండు సినిమాలు మినిమమ్ కూడా ప్రేక్షకులను అలరించలేకపోయాయి. 

 

ఒంటరిగా ఉంటే చచ్చిపోతాననే భయం ఉన్న వ్యక్తి ప్రేమలో పడితే ఏమవుతుందనే కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడు అనుకున్న పాయింట్ బాగానే ఉన్నప్పటికీ.. అతడు సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను విసిగించింది. క్రిటిక్స్ ఈ సినిమాకి దారుణమైన రేటింగ్స్ ఇచ్చారు. హీరోగా ఆది సాయికుమార్ మొదట్లో రెండు, మూడు హిట్స్ అందుకున్నాడు కానీ రాను రాను అతడి స్క్రిప్ట్ సెలెక్షన్ లో తప్పులు చేస్తుండడంతో వరుస పరాజయాలను చవిచూస్తున్నాడు. 

 

దీంతో పాటు విడుదలైన '1945' సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నిజానికి ఈ సినిమా నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు రానా. దర్శకుడికి సినిమా తీయడం రాదంటూ అప్పట్లో రానా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. హీరో లేకపోవడంతో క్లైమాక్స్ కూడా షూట్ చేయకుండానే సినిమాను విడుదల చేశారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు విసుగొచ్చింది. క్రిటిక్స్ కూడా సినిమాను ఏకి పారేశారు. 

 

ఈ రెండు సినిమాలు బాగా బోర్ కొట్టించాయి. వీటితో పాటు 'హాఫ్ స్టోరీస్', 'వేయి శుభములు కలుగునీకు', 'ఇది కల కాదు' వంటి చిన్న సినిమాలు కూడా థియేటర్లలోకి వచ్చాయి. ఏ సినిమాకి కూడా సరైన ఓపెనింగ్ లేదు. రెండో రోజే థియేటర్లలో నుంచి సినిమాలను తీసేయాల్సిన పరిస్థితి కలుగుతోంది. 

 



 























ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.