అంతా అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈరోజు 'ఆర్ఆర్ఆర్' సినిమా థియేటర్లలో ఆడుతూ ఉండేది. ఈ సినిమాను 2020లో విడుదల చేయాలనుకున్నారు. కానీ అప్పటినుంచి వాయిదా పడుతూనే ఉంది. ఫైనల్ గా 2022, జనవరి 7న రిలీజ్ చేస్తామని చెప్పారు. దానికి తగ్గట్లుగానే భారీ ప్రమోషనల్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు అంటూ తెగ హడావిడి చేశారు. ఒక్క ప్రమోషన్స్ కోసమే కోట్లలో ఖర్చు పెట్టారు. ఇప్పుడేమో కోవిడ్, ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా సినిమాను వాయిదా వేశారు. 


ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ కి సంబంధించిన డీల్స్ అన్ని పూర్తయిపోయాయి. డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాలను చెల్లించి సినిమా హక్కులను దక్కించుకున్నారు. ఇప్పుడు వాటికి వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి. మరోపక్క ఫైనాన్షియ‌ర్లు నిర్మాతపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. మొత్తం ఈ సినిమాకి రూ.180 కోట్ల ఫైనాన్స్ ఉందని తెలుస్తోంది. వాటన్నింటికీ నిర్మాత దానయ్య రెస్పాన్సిబుల్ గా ఉండేవారు. 


కానీ ఇప్పుడు ఆ బాధ్యత రాజమౌళి తీసుకున్నట్లు సమాచారం. నిర్మాతపై ఉన్న భారాన్ని తగ్గించడం కోసం రూ.180 కోట్లకు రాజమౌళి గ్యారంటీ సంతకం చేశారట. ఒక్కసారి సినిమా విడుదలైన వెంటనే ఈ మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తారు. సినిమా లాభాల్లో రాజమౌళి ప్రాఫిట్ కూడా తీసుకోబోతున్నారు. నిజానికి 'ఆచార్య' సినిమా విషయంలో కూడా ఇలానే జరిగింది. 


ఎప్పుడో మొదలైన 'ఆచార్య'ను కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పై ఒత్తిడి తగ్గించడానికి ఆ సినిమా ఆర్థిక లావా దేవీలను తన భుజాలపై వేసుకున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఇప్పుడు రాజమౌళి కూడా అలానే చేశారు. నిర్మాతలకు దర్శకులు ఇలా అండగా నిలబడడం అభినందించాల్సిన విషయం. 


Also Read:'బంగార్రాజు' కష్టాలు.. చెప్పిన టైంకి వస్తాడా..?


Also Read: షూటింగ్ క్యాన్సిల్.. ఇంట్లోనే చిల్ అవుతోన్న రౌడీ హీరో..


Also Read: క్లాసులు షురూ.. ధనుష్ 'సార్' ఆన్ డ్యూటీ..


Also Read: కోవిడ్ పాజిటివ్ వైఫ్.. నితిన్ బర్త్ డే ఎలా సెలబ్రేట్ చేశాడో చూశారా..?


Also Read: 'హృదయమా' ఫస్ట్ సింగిల్.. రిలీజ్ చేసిన మహేష్ బాబు..


Also Read: టికెట్ ధరల పెంపుపై నాగార్జున స్పందన.. అలా అనేశారేంటీ? నిర్మాతలకు షాకే!








ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.