ఇన్ స్టా ఎక్కువ లైకులు వచ్చిన ఫోటో అనగానే అందరూ అనుకునేది ఏ హాట్ హీరోయిన్ ఫోటోనో అనుకుంటారు... కానీ అది ఒక గుడ్డు ఫోటో. 2019 జనవరి 4న ‘వరల్డ్ రికార్డ్ ఎగ్’ అనే ఖాతా వారు ఒక గుడ్డు ఫోటోను పోస్టు చేశారు. దానికి ‘మనం కలిసి ప్రపంచరికార్డును తిరగరాద్ధాం. ఇన్ స్టాగ్రామ్ ఎక్కువ మంది లైక్ చేసిన పోస్టు గా దీన్ని మారుద్దాం. ఇంతవరకు ఈ రికార్డు కైలీ జెన్నర్ (18 మిలియన్లు) పేరిట ఉంది’అని క్యాప్షన్ పెట్టాడు. కైలీ జెన్నర్ అమెరికాకు చెందిన మోడల్, టీవీ ప్రజెంటర్. ఆమె ఫోటోను ఇన్ స్టాలో కోటి ఎనభై లక్షల మంది లైక్ చేశారు. ఇదే ప్రపంచరికార్డు. దీన్ని ఆమె 2018లో నెలకొల్పారు. 


ఇప్పుడు ఆ రికార్డును ఓ గుడ్డు ఫోటో బద్దలు కొట్టింది. ఆ ఫోటోను ఇప్పటివరకు యాభై అయిదు కోట్ల యాభైవేల లైకులు, 34 లక్షల కామెంట్లు సాధించింది. ఇదే ఇన్‌స్టాలో అత్యధిక లైకులు సాధించిన ఫోటోగా నిలిచింది. గత పదిరోజుల్లోనే ఈ ఫోటో మూడుకోట్లకు పైగా లైకులను సాధించింది. ఈ ఫోటోను పోస్టు చేసిన వరల్డ్ రికార్డు ఎగ్ ఖాతాకు ప్రస్తుతం దాదాపు 48 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. 


ఈ పోస్టుపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. ఎగ్‌టేరియన్లు ఆనందం వ్యక్తం చేస్తుంటే... కొంతమంది మాత్రం ‘ఇదేం పిచ్చి, ఈ గుడ్డులో ఏముంది ప్రపంచ రికార్డు సాధించేంత’ అని కామెంట్లు చేస్తున్నారు. 







Also read: పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఈ సమస్యలు తప్పవు, ముఖ్యంగా డయాబెటిక్ వారు...


Also read: నా పేరు కోవిడ్... నేను వైరస్‌ను కాను, పేరుతో ఆ కోటీశ్వరుడికి కష్టాలు


Also read: బరువు తగ్గించి, శక్తిని పెంచే ప్రోటీన్ షేక్.. ఇంట్లో ఇలా సులువుగా తయారుచేయచ్చు


Also read: కాఫీ తాగే పద్దతి ఇది... మీ ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు పాటించాల్సిందే


Also read: పాలకూర పులావ్... పోషకాలు పుష్కలం, ఎలా చేయాలంటే...


Also read: అప్పుడప్పుడు వచ్చి పోయే ఈ లక్షణాలు చాలా ప్రమాదకరం, బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు


Also read: కుకీస్‌కు బిస్కెట్లకు మధ్య తేడా ఏంటి? పిల్లలకు ఏవి పెడితే బెటర్?



 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.