HBD KGF Yash: ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ఆర్టీసీ డ్రైవర్ కొడుకు..
'కె.జి.యఫ్' సినిమాతో జాతీయ స్థాయిలో యశ్ పేరు గట్టిగా వినపడింది. పాన్ ఇండియా సినిమాల్లో `బాహుబలి` తర్వాత ఆ స్థాయి క్రేజ్‌ని తెచ్చుకున్న సినిమా `కేజీఎఫ్`. మొదటి భాగం విడుదలై సంచలన విజయం సాధించింది. కన్నడంలో రూపొందిన ఓ సినిమా ఈ స్థాయిలో విజయం సాధించడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ రోజు యష్ పుట్టినరోజు. ఈసందర్భంగా యశ్ షేర్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. యశ్ కుమారుడు యథర్వ యశ్ (Yatharv Yash) కేక్ కట్ చేశారు. అబ్బాయిని ఓ వైపు, అమ్మాయి ఐరా (Ayra)ను మరోవైపు ఎత్తుకుని ఉన్న ఫొటోను యశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో యశ్ వైఫ్ రాధికా పండిట్ కూడా ఉన్నారు.
పుట్టినరోజులు నన్ను అంత ఎగ్జైట్ చేయవు. చుట్టుపక్కల వారిలో సంతోషాన్ని నేను చూస్తాను. ముఖ్యంగా నా చిన్నారుల్లో! వాళ్లు నేను సెలబ్రేట్ చేసుకునేలా చేస్తారు. ఈ సందర్భంగా నాపై ప్రేమ, అభిమానం, ఆశీర్వాదం చూపిస్తున్న ప్రతి ఒక్క అభిమానికి, శ్రేయోభిలాషికి థాంక్యూ. అందరూ సేఫ్‌గా ఉన్నారని ఆశిస్తున్నాను అని యశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. . యశ్ పుట్టినరోజు సందర్భంగా 'కె.జి.యఫ్ 2' టీమ్ కొత్త పోస్టర్ విడుదల చేసింది.
యష్ హీరోగా, శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్‌నీల్ దర్శకుడు. హోంబలే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఇందులో సంజయ్ దత్, రవీనా టండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. ఈయన 1986 జనవరి 8న కర్ణాటకలో హసన్‌లోని భువనహళ్లిలో జన్మించాడు. తండ్రి అరుణ్ కుమార్ ఆర్జీసీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.. ఇప్పటికీ ఈయన అదే పని చేస్తున్నాడు. తల్లి పుష్పలత, చెల్లెలు నందిని, భార్య రాధికా పండిట్..
నంద గోకుల సీరియల్ చేస్తున్నపుడే రాధిక పండిట్‌తో పరిచయం ఏర్పడింది.. ఆ తర్వాత సినిమాలు కూడా కలిసి చేసారు. అలా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి.. 2016 డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు. 2007లో జంబాడ హుడిగి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు యశ్.
యశ్ ఫ్యామిలీ (image credit : Radhika Pandit/Instagram)
యశ్ ఫ్యామిలీ (image credit : Radhika Pandit/Instagram)
యశ్ ఫ్యామిలీ (image credit : Radhika Pandit/Instagram)
యశ్ ఫ్యామిలీ (image credit : Radhika Pandit/Instagram)
యశ్ ఫ్యామిలీ (image credit : Radhika Pandit/Instagram)
యశ్ ఫ్యామిలీ (image credit : Radhika Pandit/Instagram)