చిన్నవయస్సులోనే చిచ్చురుపిడుగులా చెలరేగిపోతున్నాడు..స్కేటింగ్ లోని లింబో ప్రదర్శన....ఎలాంటి సహాయం లేకుండానే గోడలెక్కేయడం ఇలా ఒకటేమిటి అన్నిరకాల విన్యాసాలు చేస్తున్నాడు పదేళ్ళే హర్షవర్దన్. అనంతపురంలోని ఓల్డ్ టౌన్లోని హర్షవర్దన్ లింబో స్కేటింగ్ లో పలు రికార్డులు సృష్టిస్తున్నాడు. అతి సాహసోపేతమైన  ఫైర్ లింబో స్కేటింగ్ లో వజ్రా ప్రపంచరికార్డు వారి ఆద్వర్యంలో కూడా ప్రదర్శన ఇచ్చాడు. 7.5ఇంచుల ఎత్తులో అగ్గిమంటల కింద నుంచి బుల్లెట్ లా దూసుకువచ్చిన దృశ్యాలు చూసేవాళ్లను మైమరిపించాయి.


తాడిపత్రి మండలం ఆలూరుకొన గ్రామానికి చెందిన రాజేశ్వరాచారి, సునీతమ్మ ల కుటుంబం కార్పెంటర్ వృత్తి చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. పిల్లల విద్యకోసం అనంతపురం వచ్చారు. ఆరో తరగతి చదువుతున్న వారి కుమారుడు హర్షవర్దన్ స్కేటింగ్ పట్ల వున్న ఇంట్రెస్ట్ ను గమనించిన తల్లిదండ్రులు...అనంతపురం పీటీసీలోని స్కేటింగ్ కోచింగ్ సెంటర్లో చేర్పించారు. అక్కడ హర్షవర్దన్ కదిలే తీరు, కాళ్ళకు చక్రాలు కట్టుకొని వేగంగా కదిలే విధానాన్ని గమనించిన శిక్షకులు.. మరింత మెరుగైన ట్రైనింగ్ కోసం తిరుపతికి పంపించారు.


అక్కడి నుంచి వివిధ జాతీయ పోటీల్లో పాల్గొన్న హర్షవర్దన్ 15 గోల్డ్ మెడల్స్ సాధించాడు. ప్రతిష్ఠాత్మక ఏసీయా బుక్ ఆప్ రికార్డ్, యూఆర్ఎప్ రికార్డును కూడా సొంతం చేసుకొన్నాడు.కేవలం ఆరు ఇంచులు ఎత్తులో పడుకొని 7.5ఇంచుల ఎత్తులో మంటలు వుంటే వాటికింద పడుకొని చేసిని స్కేటింగ్ ప్రదర్శన అద్భుతం. ఇంతటితో ఆగలేదు హర్షవర్దన్ ఎలాంటి సహాయం లేకుండా అవలీలగా గోడలు ఎక్కేస్తాడు. ఇరవై...ఇరవై ఐదు అడుగుల వరకు ఈజీగా ఎక్కేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇంత టాలెంట్ వున్న హర్షవర్దన్ కు ప్రభుత్వం నుంచి  ఏమాత్రం స్పందన లేదు. అమెరికన్ గాట్ టాలెంట్ వారి ముందు ప్రదర్శన ఇచ్చేందుకు అప్లై చేసుకొన్నాడు. గిన్నిస్ బుక్ ఆప్ రికార్డ్ కోసం అప్లై చేశాడు. అయితే కార్పెంటర్ వృత్తి చేసుకొని జీవనం సాగించే హర్షవర్దన్ తల్లిదండ్రులు ఇంతటి భారాన్ని భరించే స్థితిలో లేరు. ప్రభుత్వం నుంచి స్పందన వస్తే తప్ప గిన్నిస్ బుక్ ఆప్ రికార్డు, కానీ అమెరికన్ గాట్ టాలంట్ ముందు కానీ ప్రదర్శనలు ఇచ్చే పరిస్థితి వుండదు. అందుకే ప్రభుత్వం స్పందించి తమ పిల్లాడి టాలెంట్ ను గుర్తించాలని అంటున్నారు హర్షవర్దన్ తల్లిదండ్రులు.



 


Also Read: Kurnool : కర్నూలు నగరంలో శుక్రవారం ఆటో ప్రయాణం ఫ్రీ.. ప్రశంసలు అందుకుంటున్న ఖాదర్ ప్రయత్నం


Also Read: Sankranti: గోదారోళ్లా మజాకా... రూ.3.6 లక్షలు పలికిన పందెం పుంజు.... ఈసారి తగ్గేదేలే అంటున్న పందెంరాయుళ్లు


Also Read: TDP One Side Love : ఏపీలో ట్రయాంగిల్ పొలిటికల్ లవ్ స్టోరీ ! క్లైమాక్స్ మలుపు తిప్పుతుందా ?