కర్నూలులో పది రూపాయల డాక్టర్ ఇస్మాయిల్ అంటే ప్రతి ఒక్కరు గుర్తు పడతారు. ఆయన మరణానంతరం అదే స్ఫూర్తితో ఒక ఆటో డ్రైవర్ జీవిస్తున్నాడు. ప్రయాణికుల కోసం ఫ్రైడే ఫ్రీ ఆటో సేవలు అందిస్తున్నారు ఖాదర్ బాషా.


ఓ చోటు నుంచి మరో చోటికి ప్రయాణం చేయాలంటే ఖర్చుతో కూడిన పని. కనీసం 20 నుంచి 50 రూపాయాలు ఖర్చు చేయాలి. ఇలాంటి పరిస్థితిలో ఓ వ్యక్తి ముందుకొచ్చి ఉచితంగా తన ఆటోలో ప్రయాణికులను వారి గమ‌్య స్థానాలకు చేరువేస్తున్నారు.


ఖాదర్ బాషా ప్రకాష్ నగర్‌లో ఉంటున్నాడు. రోజూ 300 నుంచి 600 రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. పది రూపాయల డాక్టర్ ఇస్మాయిల్ స్పూర్తితో వినూత్నంగా ప్రజలకు చేరువయ్యాడు ఖాదర్‌ బాషా. ప్రతి శుక్రవారం ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజలకు ఉచితంగా ఆటో సేవలు అందిస్తున్నాడు. 


తాను చాలాసార్లు చేతిలో డబ్బుల్లేక చాలా దూరం కాలినడకన వెళ్లాల్సి వచ్చేదని ఖాదర్ బాషా చెప్తున్నాడు. అ బాధ తెలిసే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని చెప్తున్నాడు.


వృద్దులు, మహిళలు, విద్యార్ధులకు ఉచితంగా గమ్య స్థానాలకు చేరవేస్తున్నాడు. ఎవరి ఫీల్డ్‌లో వాళ్లు తమకు తోచిన విధంగా సాయం చేస్తే చాలా మంది సమస్యలు పరిష్కారమవుతాయని అంటున్నాడు ఖాదర్‌ బాషా. ఇలా చేయడం తనకు చాలా ఆనందంగా ఉందని.. జీవితాంతం ఈ ఉచిత ఆటో సర్వీస్‌ కొనసాగుతుందని చెప్తున్నారాయన.


మంచి చేయాలనే ఆలోచన ఉండాలే కానీ అందుకే మర్గాలు చాలా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు స్థానికులు. అందుకు ఖాదర్ బాషాను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇలా శుక్రవారం రోజున ఉచితంగా సేవలు అందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు ఖాదర్ బాషా. ఆయన సేవకు ఖాదర్ బాషా ఫ్యామిలీ కూడా ఆనందం వ్యక్తం చేస్తోంది. 


Also Read: మ‌గాళ్ల‌కు మంచి టిప్‌... అదీ పెళ్లి త‌ర్వాత భార్య‌తో బాల‌కృష్ణ చేసుకున్న‌ అగ్రిమెంట్!
Also Read: చచ్చిపోతా, మంట పెట్టేస్తారనుకున్నా - రాజ‌శేఖ‌ర్‌ భావోద్వేగం... జీవిత కన్నీరు
Also Read: ఏపీలో సినిమా వ్యాపారానికి మరో దెబ్బ... కొత్త సినిమాలకు కలెక్షన్లు రావడం కష్టమే!
Also Read: 'అతిథి దేవో భ‌వ‌' రివ్యూ: ప్రేక్ష‌కుల్ని అతిథుల్లా చూశారా? లేదా?
Also Read: ఏడిస్తే కష్టం పోతుందా? - దీప్తి సునయన లేటెస్ట్ పంచ్! బ్రేకప్ బాధ నుంచి బయటకొస్తోందా?
Also Read: మహేష్ నుంచి త‌మ‌న్‌కు... త‌మ‌న్ నుంచి ఎవ‌రికి? నెక్స్ట్ ఎవరు??
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.