రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే జీఓ 317 వచ్చిందని.. దానిపై బీజేపీ నాటకాలు ఆడటం విడ్డూరంగా ఉందని.. మంత్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ 14కోట్ల ఉద్యోగాల హామీ ఏమైనట్టు అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రయత్నిస్తుంటే బీజేపీ అడ్డుకుంటోదని హరీశ్‌రావు అన్నారు. అవినీతిపై శివరాజ్‌సింగ్ చౌహాన్ వంటి నేతలు మాట్లాడటం విచిత్రంగా ఉందని విమర్శించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ అవాకులు చవాకులు పేలారని.. కుంభకోణాల్లో మునిగిన శివరాజ్ సింగ్ కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. శివ రాజ్ సింగ్ సీఎం మాటలు చూస్తుంటే.. వంద ఎలుకలు తిన్న పిల్లి శాకహారిని అన్నట్లు ఉందని విమర్శించారు. శివరాజ్‌సింగ్‌కు టీఆర్ఎస్, కేసీఆర్‌ను విమర్శించే హక్కు లేదని స్పష్టం చేశారు.
శివరాజ్ సింగ్ చౌహన్ దొడ్డిదారిన ఎమ్మెల్యే అయిన విషయం అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. తెలంగాణకు మధ్యప్రదేశ్‌కు పోలికే లేదని హరీశ్ రావు అన్నారు. ఏ రంగంలో మధ్యప్రదేశ్ అభివృద్ధి సాధించింది? మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణం సంగతి ఏంటి? అని ప్రశ్నించారు. కాళేశ్వరంలో అవినీతి లేదని కేంద్రమే చెప్పిందని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్‌కు శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు పోలికే లేదని.. దొడ్డిదారిన శివరాజ్‌సింగ్ సీఎం అయ్యారని మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రజలే అధిష్ఠానంగా కేసీఆర్ సీఎం అయ్యారన్నారు. ప్రధాని, బీజేపీ సీఎంలు.. కేసీఆర్‌ను ప్రశంసించలేదా? బీజేపీ నేతలకు ఉద్యోగులపై నిజంగా ప్రేమ ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ మాదిరిగా బీజేపపీ పాలిత ప్రాంతాల్లో జీతభత్యాలు ఇస్తున్నారా? అని అడిగారు.
Also Read: KCR CPM : కమ్యూనిస్టు పార్టీలతో కేసీఆర్ కీలక చర్చలు.. ప్రగతి భవన్‌లో విజయన్, ఏచూరీలతో విందు భేటీ !
Also Read: PM Modi Call to Bandi Sanjay: బండి సంజయ్ కు ప్రధాని మోదీ ఫోన్... 317జీవోపై ప్రధాని ఆరా