వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాలఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంగం ప్రకటించింది. 7 దశల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలను నిర్వహిస్తారు. తొలి దశ నోటిఫికేషన్ జనవరి 14వ తేదీన విడుదల కానుంది. మొదటి దశ పోలింగ్ ఫిబ్రవరి 10వ తేదీన ఉంటుంది. ఆ తర్వాత వరుసగా 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో వరుసగా పోలింగ్ జరుగుతుంది. యూపీలోనే ఏడు విడుతలు జరుగుతాయి. మార్చి పదో తేదీన కౌంటింగ్ జరుగుతుంది. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాల్లో ఒకే దశలో పోలింగ్ ముగుస్తుంది.
ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. యూపీలో 403, పంజాబ్‌లో 117, గోవాలో 40, ఉత్తరాఖండ్‌లో 70, మణిపూర్‌లో 60 మొత్తం 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో 18 కోట్ల మందికి పైగా ఓటర్లు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈసారి 18.34 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కోవిడ్ వల్ల పోలింగ్ స్టేషన్ల సంఖ్య పెంచామని సీఈసీ తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యవపరిమితి రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 900 మంది ఎన్నికల అబ్జర్వర్లు నియమించినట్లు తెలిపారు. కోవిడ్ కారణంగా జనవరి 15 వరకు రోడ్ షోలను నిషేధించామని సీఈసీ తెలిపారు. రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటలకు వరకూ పబ్లిక్ మీటింగ్ పెట్టకూడదని పేర్కొన్నారు. అభ్యర్థుల విజయోత్సవాలు రద్దు చేసినట్లు తెలిపారు. పాదయాత్రలు, రోడ్ షోలకు అనుమతి లేదన్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ లో నామినేషన్ వేసేందుకు అనుమతి ఇచ్చామన్నారు.
డబుల్ వ్యాక్సిన్లు తీసుకున్నవారినే ఎన్నికల డ్యూటీ వేస్తామన్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా కొత్త నిబంధనలతో సేఫ్ ఎన్నికలు నిర్వహిస్తున్నామని సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. కోవిడ్ సోకిన వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. సీవిజిల్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను ఈ యాప్ ద్వారా ఈసీ దృష్టికి తీసుకురావొచ్చని తెలిపారు. నిబంధనల ప్రకారం ఈసీ చర్యలు తీసకుంటుందన్నారు. కరోనా దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వైద్య ఆరోగ్య, భద్రతా నిపుణులతో చర్చించిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించామని సీఈసీ తెలిపారు.