Weather Updates: ఏపీ, తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత రోజురోజుకూ తగ్గుతోంది. ఈశాన్య, తూర్పు దిశల నుంచి ఏపీలో గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయిని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, యానాంలో నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో చలి ప్రభావం అంతగా కనిపించడం లేదని వాతావరణ కేంద్రం తెలిపింది. 





మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఇబ్బంది లేదని వాతావరణ కేంద్రం సూచించింది. విశాఖ, విజయనగరం జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కళింగపట్నంలో 16.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, బాపట్లలో 17.5 డిగ్రీలు, నందిగామలో 17.2 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. దక్షిణ కోస్తాంధ్రలో వాతావరణంలో ఏ మార్పులు లేవు. మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉండనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో వాతావరణం కాస్త వేడిగా మారింది. ఏపీలోని రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.  ఇక్కడ సైతం ఎలాంటి వర్ష సూచన లేదు. ఆరోగ్యవరంలో కనిష్టంగా 17.5 డిగ్రీలు, కర్నూలులో 18.7 డిగ్రీలు, నంద్యాలలో 19.4 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. 







తెలంగాణ వెదర్ అప్‌డేట్..
ఆగ్నేయం, తూర్పు దిశ నుంచి తెలంగాణలో తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉదయం వేళ కొన్ని ప్రాంతాల్లో పొగ మంచు కురుస్తుంది. డిసెంబర్ 9 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల వరకు ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది.











Also Read: WHO On Omicron: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మరిన్ని ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొస్తాయని డబ్ల్యూహెచ్‌ఓ వార్నింగ్..!


Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి