నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెవెన్యూ, దేవదాయశాఖల్లో పలు ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెవెన్యూ శాఖలో 670 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దేవదాయ శాఖలో 60 ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. డిసెంబర్ 30 నుంచి 2022 జనవరి 19వ తేదీ వరకు దరఖాస్తుకు చేసుకునే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు.. ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో దొరుకుతాయి.


రెవెన్యూ శాఖ‌లోని 670 జూనియ‌ర్ అసిస్టెంట్ క‌మ్ కంప్యూట‌ర్ అసిస్టెంట్ పోస్టులు, దేవదాయ శాఖ‌లోని 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్ జారీచేసిన‌ట్టు  ఏపీపీఎస్సీ కార్యదర్శి.. పీఎస్సార్ ఆంజ‌నేయులు చెప్పారు.


జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి.. అప్లై చేసుకునేవారు.. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్టు ఉత్తీర్ణులై ఉండాలి. 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రాత పరీక్ష(స్క్రీనింగ్‌ టెస్ట్, మెయిన్‌ ఎగ్జామినేషన్‌) కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.


శ్రీకాకుళం-38, విజయనగరం-34, విశాఖ-43, తూర్పు గోదావరి  జిల్లా-64, పశ్చిమగోదావరి జిల్లా-48, కృష్ణా-50, గుంటూరు-57, ప్రకాశం-56, నెల్లూరు-46, చిత్తూరు-66, అనంతపురం-63, కర్నూలు-54, కడప-51 పోస్టులు ఉన్నాయి.


దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–3(ఎండో మెంట్స్‌ సబ్‌ సర్వీస్‌) పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారు.. ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష(స్క్రీనింగ్‌ టెస్ట్, మెయిన్‌ ఎగ్జామినేషన్‌) కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.


శ్రీకాకుళం-4, విజయనగరం-4, విశాఖ-4, తూర్పుగోదావరి జిల్లా-8, పశ్చిమగోదావరి జిల్లా 7, కృష్ణా-6, గుంటూరు-7, ప్రకాశం-6, నెల్లూరు-4, చిత్తూరు-1, అనంతపురం-2, కర్నూలు-6, కడప-1లో పోస్టులు ఉన్నాయి.


అప్లై చేయాలనుకునేవారు.. అధికారిక వెబ్ సైట్.. https://psc.ap.gov.in కు వెళ్లాలి. 30.12.2021 నుంచి 19.01.2022లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


Also Read: UPSC Recruitment: యూపీఎస్సీలో ఉద్యోగాలు.. అర్హులు ఎవరు? ఎలా అప్లై చేసుకోవాలి 


Also Read: ONGC Recruitment 2021: ఓఎన్​జీసీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు జనవరి 4న చివరి తేదీ.. అప్లై చేసుకోండిలా..


Also Read: State Bank Of India Recruitment 2021: ఎస్‎బీఐ నుంచి గుడ్ న్యూస్..  భారీగా పోస్టులు.. అప్లై చేసుకోండిలా..


Also Read: JEE Main 2022 Registrations Soon: జేఈఈ మెయిన్ 2022 రిజిస్ట్రేషన్స్.. అర్హత నుంచి పరీక్ష వరకు తెలుసుకోవాల్సినవి ఇవే


Also Read: CBSE Question Paper: సీబీఎస్ఈ క్వశ్చన్ పేపర్ ఎలా ప్రిపేర్ చేస్తారో తెలుసా?