ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జనవరి 4వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ మేరకు ఓఎన్ జీసీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు.. జనవరి 4వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. మెుత్తం 21 ఖాళీలకు గానూ.. నోటిఫికేషన్ విడుదలైంది.
హెచ్ ఆర్ ఎగ్జిక్యూటీవ్ 15 పోస్టులు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ 6 పోస్టులు ఉన్నాయి. మెుత్తం 21 పోస్టులకు గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
పర్సనల్ మేనేజ్మెంట్/హెఆర్డీ/హెచ్ ఆర్ ఏమ్ తదితర విభాగాల్లో ఎంబీఏలో 60 శాతం మార్కులు సాధించిన వారు ఈ పోస్ట్ కు అప్లే చేసుకోవచ్చు. పబ్లిక్ రిలేషన్స్/జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్ లో 60 శాతం మార్కులతో పీజీ చేసిన వారు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు తప్పనిసరిగా UGC NET-June 2020 అర్హత సాధించాలి.
అప్లై చేసేందుకు.. అధికారిక వెబ్ సైట్ https://www.ongcindia.com/wps/wcm/connect/en/home కు వెళ్లాలి. అనంతరం కేరీర్ విభాగంలో రిక్రూట్ మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ రిక్రూట్ మెంట్ కు సంబంధించి.. ఆప్షన్ కనిపిస్తుంది. తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ లో వివరాలను నమోదు చేయాలి. రూ. 300ను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. EWS, OBC కేటగిరీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపునిచ్చారు.
Also Read: TS Inter Results : కరోనా కాలం చదవులా ? ఇంటర్ బోర్డు పొరపాటా? వివాదంగా మారిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు !
Also Read: డెల్టా మరణమృదంగం - రైతు చట్టాల ఉపసంహరణ.. ! 2021లో భారత్‌కు మరపురాని మైలురాళ్లు ఎన్నో...
Also Read: CBSE Question Paper: సీబీఎస్ఈ క్వశ్చన్ పేపర్ ఎలా ప్రిపేర్ చేస్తారో తెలుసా?