తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఏకంగా 51 శాతం మంది ఫెయిలవడం వివాదాస్పదంగా మారింది.  విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళనలుప్రారంభించారు.  గత ఏడాది 60 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. ఈ సారి  49 శాతానికే పరిమితమయింది.  కరోనా టైమ్‌లో విద్యార్ధులు ఎన్నో ఇబ్బందులు పడి పరీక్షలు రాస్తే.. మరీ ఇంత తక్కువ మందిని పాస్ చేస్తారా అంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అభ్యంతరం తెలుపుతున్నారు. పేపర్ వాల్యుయేషన్ కఠినంగా చేశారనీ..  బాగా చదివే పిల్లలుకూడా  ఫెయిల్ అయ్యారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నెల రోజులే టైమ్ ఇచ్చి పరీక్షలు పెట్టారని  .. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగానే ఇంత మంది ఫెయిల్ అయ్యారంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు ప్రారంభించాయి. 


Also Read: హెల్మెట్, మిర్రర్స్ లేవా పుష్ప... సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం


 
గత మార్చిలో కరోనా ఉధృతి కారణంగా ప్రభుత్వం పరీక్షలు లేకుండానే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌ను సెకండియర్లోకి ఇంటర్ బోర్డు ప్రమోట్ చేసింది. ప్రస్తుతం కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో మళ్లీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించింది.  కరోనా వల్ల సరిగ్గా క్లాసులు జరగక  విద్యార్థులు సరిగా చదవలేకపోయారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ క్లాసులు సరిగా అర్థం కాలేదన్నారు. ఈ సిట్యువేషన్లో పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  


Also Read: ఇక బీజేపీది ప్రభంజనమే.. కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకుంటానన్న ఈటల రాజేందర్ !
 
ఫెయిలయిన ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని  హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయిర. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగా ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని  విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై ఇంటర్ బోర్డు ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే మూల్యాంకనంలో పొరపాటు జరగలేదని చెబుతున్నారు. 


Also Read: KCR Nominated Posts : ఉద్యమకారుల్లో అసంతృప్తి తగ్గించేందుకు నామినేటెడ్ పోస్టులు.. కొత్తగా మరో ఐదుగురికి రాష్ట్ర స్థాయి పదవులిచ్చిన కేసీఆర్ !


కరోనా కారణంగా విద్యా ప్రమాణాలు భారీగా పడిపోయాయని అనేక విశ్లేషణలు వస్తున్నాయి. సరిగ్గా క్లాసులు జరగక.. ఆన్ లైన్ క్లాసులు అర్థంకాక విద్యార్థులు చదువుల్లో వెనుకబడిపోయారు. ఆ ప్రభావం పరీక్షల్లో కనిపిస్తోందని భావిస్తున్నారు. అదే నిజం అయితే కరోనా సీజన్లలో క్లాసులు మిస్సయిన విద్యార్థులు భవిష్యత్‌లోఇబ్బందులు పడతారన్న అభిప్రాయం విద్యారంగ నిపుణుల్లో వ్యక్తమవుతోంది. 


Also Read: వరి పంట వేస్తే "రైతు బంధు" నిలిపివేస్తారా !? .. కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి