తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ సొంత పార్టీలో అసంతృప్తులపై దృష్టి పెట్టారు. అందరికీ వీలైనంత వరకు ప్రాధాన్యం కల్పించి సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే నామినేటెడ్ పోస్టులభర్తీ ప్రక్రియను చురుగ్గా ప్రారంభించారు.  రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులను ఎనిమిదింటిని మూడు రోజుల్లోభర్తీ చేశారు. అన్నీ .. పార్టీ కోసం  పని చేసిన వారు.. ఉద్యమంలో చురుగ్గా ఉన్న వారికే కేటాయించారు. గతంలో ఇచ్చిన హమీలు... ముందు ముందు అవసరాలు చూసుకుని మరీ ప్రాధాన్యత కల్పిస్తున్నారు. 


Also Read: తెలంగాణలో కారుతో పొత్తుకు కామ్రెడ్లు సిద్ధమే..! వ్యూహాలు అమలు చేస్తున్న నేతలు


మూడు రోజుల కింట ముగ్గురు యువ నేతలకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు ప్రకటించారు. తాజాగా ఐదు రాష్ట్ర కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్  చైర్మన్ గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను నియమించారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ తరపున గెలిచి.. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. అయితే ముందుగా హామీ ఇచ్చిన ప్రకారం ఎమ్మెల్సీ ఇవ్వలేకపోవడంతో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు.  ఇక ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్‌తో కలిసి పని చేస్తున్న గజ్జెల నగేష్‌కు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్  చైర్మన్ గా ,  పాటిమీది జగన్మోహన్ రావుకు  .తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్" చైర్మన్ గా అవకాశం కల్పించారు. వీరు చాలా కాలంగా తమకు ప్రాధాన్యం దక్కుతుందేమోనని ఎదురు చూస్తున్నవారే. 


Also Read: వరంగల్ కు జెన్పాక్ట్ ఐటీ కంపెనీ... మంత్రి కేటీఆర్ తో జెన్పాక్ట్ బృందం భేటీ...


.తెలంగాణ సాహిత్య అకాడమీ" చైర్మన్ గా జూలూరి గౌరీశంకర్‌ను నియమించారు. తెలంగాణ సాహిత్య ప్రపంచంలో గౌరశంకర్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన టీఆర్ఎస్ కోసం నేరుగా పని చేయలేదు. కానీ తెలంగాణ ఉద్యమంలో సాహిత్య లోకాన్ని ఏకం చేయడంలో తన వంతు పాత్ర పోషించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనకు సరైన గుర్తింపు రాలేదన్న అభిప్రాయం  ఉంది. ఈ క్రమంలో ఆయనకు రాష్ట్ర స్థాయి పదవి లభించింది.  తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్" చైర్మన్ గా దూదిమెట్ల బాలరాజు యాదవ్ ను నియమించారు. పదవి కోసం ఎదురు చూస్తున్న టీఆర్ఎస్ సీనియర్ నేతల్లో ఈయన ఒకరు.


Also Read: సోనియాతో డీఎస్ భేటీ.. త్వరలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం !  


టీఆర్ఎస్‌ కోసం పని చేసిన వారు.. తర్వాత వివిధ సందర్భాల్లో టీఆర్ఎస్‌లో చేరిన వారు అనేక మంది పదవుల కోసం ఎదురు చూస్తున్నారు.  అలాగే సుదీర్ఘ కాలంగా టీఆర్ఎస్‌లో ఉన్న వారు తమకు ప్రాధాన్యం దక్కడం లేదని అసంతృప్తిలో ఉన్నారు. ఇది ఇతర పార్టీలకు అవకాశంగా మారింది. తమ పార్టీలో చేరితే మంచి భవిష్యత్ ఉంటుందని గాలం వేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యమ కాలం నుంచి ఉండి.. సరైన గుర్తింపు లేని వారిని ఆహ్వానిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ ఉద్యోగసంఘాల్లో కీలక పాత్ర పోషించి విఠల్‌తో పాటు మరికొంత మంది బీజేపీలో చేరిపోయారు. ఇంకొంత మంది చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. వీటికి చెక్  పెట్టడానికి కేసీఆర్ నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రారంభించినట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ భర్తీ ఇలా కొనసాగుతుందని.. మరికొంత మందికి కీలకమైన పదవులు లభించబోతున్నాయని టీఆర్ఎస్‌లో ప్రచారం జరుగుతోంది. 
 


Also Read: ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ.. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి