గుప్పెడంత మనసు డిసెంబరు 17 శుక్రవారం ఎపిసోడ్
గుప్పెడంత మనసు డిసెంబరు 17 శుక్రవారం ఎపిసోడ్ లో రిషి కోపంగా ఉన్నాడేంటి వసుధారని అడిగితే తెలుస్తుందా అనుకుంటూ ధరణి కాల్ చేస్తుంది. రిషి సర్ అనుకున్నా అంటూ కాల్ లిఫ్ట్ చేసిన వసు చెప్పండి మేడం అంటుంది. నిన్నొక మాట అడగనా అంటూ అత్తయ్యగారి విషయంలో నీకు-రిషికి గొడవ జరిగిందా అని అడుగుతుంది ధరణి. జరిగినదాంట్లో నా తప్పేమీ లేదని చెప్పిన వసుధార... సర్ కోపంగా ఉన్నారా అని అడుగుతుంది. ఆవిడగారికి ఏమీ కాలేదు కదా అని అడిగిన వసుతో ఆవిడ సంగతి తెలిసిందే కదా అవసరమైదానికన్నా ఎక్కువే చేస్తారంటుంది ధరణి. వసుధారా నువ్వెలాగైనా రిషి కోపం పోగొట్టాలంటుంది ధరణి. పాలు పొంగుతున్నాయంటూ ఫోన్ పక్కనపెడుతుంది. ఇంతలో అక్కడకు వెళ్లిన రిషి ఫోన్ లైన్లో వసుధార ఉందని చూసి..ఓహో వదిన వసుధారతో ఫోన్ మాట్లాడుతున్నారా అనుకుని పాలు పోసి ఇవ్వండని అడుగుతాడు. నీ రూమ్ కి తీసుకొస్తాలే అన్నా వదినా ఇక్కడే తాగుతా అంటాడు. ఫోన్ కట్ చేయడం లేదేంటి మరిచిపోయారా అనుకుంటూ కాల్ మధ్యలో కట్ చేస్తే బావోదని ఆగిపోతుంది వసుధార.
Also Read: వసుధార కౌంటర్లకి విలవిల్లాడుతున్న ఇగోమాస్టర్ రిషి.. వసుని చూసి మురిసిపోతున్న గౌతమ్, గుప్పెడంత మనసు డిసెంబరు 16 గురువారం ఎపిసోడ్
వసు ఫోన్ లైన్లో ఉందని తెలిసి కావాలని రిషి మాట్లాడతాడు. పెద్దమ్మకు ఆ గాయం ఎలా తగిలిందో మీకు తెలుసుకదా, పెద్దమ్మ అంటే నాకు ఎంత గౌరవమో మీకు తెలుసు, ఎంత బాధపడుతున్నారో కూడా తెలుసు అంటాడు. ఆ వసుధార పెద్దమ్మ విషయంలో చాలా చేసి సారీ కూడా చెప్పలేదు, చిన్న చిన్న విషయాలకే సారీ చెబుతుంది కానీ ఇంత పెద్ద తప్పు చేసి సారీ చెబితే తన కిరీటం పడిపోతుందా ఏంటని అంటాడు. ఫోన్ ను చేతిలోకి తీసుకున్న రిషి కావాలనే మాట్లాడతాడు. మనవల్ల ఎవరైనా గాయపడితే ఫీలవమా, అవుతామా అవమా చెప్పండి వదినా అని రెట్టిస్తాడు. అవుతాం రిషి అంటుంది ధరణి. కానీ ఆ వసుధార ఏంటొదినా అహంకారమా , గర్వమా అంటే...ఆత్మగౌరవం అని వసు మనసులో అనుకుంటుంది. వసు తప్పు అని ధరణి అనేలోగా నేను చూశాను కదా, కాలేజ్ టాపర్, యూత్ ఐకాన్ ఐతే కావొచ్చు మరీ ఇంతనా, ఇది కరెక్ట్ కాదు వదినా అంటాడు. ఆపు రిషి అవతల వసుధార వింటుందంటూ ధరణి టెన్షన్ పడుతుంది. వదినా రేపు నా ఫ్రెండ్ ఇంటికొస్తున్నాడు కొన్ని డేస్ ఇక్కడుంటాడు మీరు వంటపనులు చేయకండి, పనిమనిషిని రప్పించండని చెబుతాడు. వసుధార మొత్తం వినే ఉంటుంది..వినాలనేగా చెప్పింది.. ఆ మాత్రం ఆలోచన లేకుండా ఉంటుందా ఏంటని వెళ్లిపోతాడు. వసు మొత్తం వినేసే ఉంటుందని ధరణి అనుకుంటుంది. నా తప్పు లేదు, సారీ చెప్పేదే లేదంటుంది వసుధార.
Also Read: వసుధారతో ప్రేమలో పడిన గౌతమ్, రిషి మనసులో మళ్లీ అలజడి మొదలు.. ఇంట్రెస్టింగ్ గా సాగిన 'గుప్పెండత మనసు' బుధవారం ఎపిసోడ్
కోపంగా వెళ్లిపోతున్న వసుధారని జగతి మేడం పిలుస్తారు. రిషి చెప్పిన కాన్సెప్ట్ లో నీ హెల్ప్ కావాలంటుంది జగతి. ఏమైంది అని అడిగితే ఏమీ లేదని చెబుతుంది. చెప్పు వసుధార అంటే మీ అబ్బాయి మేడం..దేవయాని గారి విషయంలో నన్ను నిందిస్తున్నారు..నాకు అహంకారం అంట నేను సారీ చెప్పాలంట అన్నారు. ధరణితో నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడకు వచ్చి ఫోన్ ఆన్ లో ఉందని తెలియని తన మనసులో ఉన్నది చెప్పారు. మనవైపు నుంచి తప్పు జరగలేదన్నది మనకు తెలుసు ఎందుకు ఫీలవ్వాలి అంటుంది. వసు మాటమాటికీ మా అబ్బాయి అంటున్నావ్ మా అబ్బాయికి, రిషి సర్ కి చాలా తేడా ఉంది. నీకు నచ్చని పని చేస్తే మా అబ్బాయి అవుతాడు, నీకు నచ్చే పని చేస్తే రిషి సర్ అవుతాడు-జెంటిల్మెన్ అవుతాడు, ఇంటికొచ్చి హారన్ సౌండ్ వినిపించి పరిగెత్తితే రిషి సర్ అవుతాడు, నిన్ను తిడితే మా అబ్బాయి అవుతాడంటుంది జగతి. నేను అంతదూరం ఆలోచించలేదు.. నాతో సారీ చెప్పుంచుకోవాలని చూస్తున్నారంటుంది. రిషి... ధరణితో అంటే నేనేం చేస్తా అంటుంది జగతి. ఎక్కువ మాట్లాడితే రిషి సర్ నాకు క్షమాపణలు చెప్పాల్సిందే అంటుంది వసుధార. సరే వసు ప్రస్తుతానికి ఈ షార్ట్ ఫిలిం వర్క్ నేను ఒక్కదాన్నే చేసుకుంటా అంటుంది ధరణి. మొత్తానికి రెస్టారెంట్లో రిషిని తప్పుదారి పట్టించడంలో దేవయాని సక్సెస్ అయింది. రిషి సంగతి తెలిసి కూడా వసు ఏంటో మొండిగా వాదిస్తోంది అనుకుంటుంది జగతి.
Also Read: తొలిచూపులోనే వసుధారకి పడిపోయిన గౌతమ్, రిషిని హెల్ప్ చేయమంటూ షాకింగ్ ట్విస్ట్..
మహేంద్ర, రిషి, గౌతమ్ వర్కౌట్స్ చేస్తుంటారు. గౌతమ్ సరదాగా రిషి ఇలా చేస్తే రెండు రోజుల్లో నీలా అయిపోతానా..అయిపోతానా చేసేద్దాం అంటాడు. ఈ మార్నింగ్ హాయిగా ఉంది కదా అంటే.. మహేంద్ర నీ మనసు హాయిగా ఉండి ఉంటుంది అందుకే నీకలా అనిపిస్తోందంటాడు గౌతమ్. అంకుల్ మీరు నా మనసుని ఒక్క మాటలో చదివేశారు అంటాడు గౌతమ్. ఏంటోయ్ పొద్దున్నే పొగుడుతున్నావ్ అంటే నాతో ఏదో పని ఉందంటాడు మహేంద్ర. ఇది నిజం డాడ్ వాడు అందర్నీ బుట్టలో వేసేసుకుంటాడని రిషి అంటే..దాన్నే లౌక్యం అంటారంటాడు గౌతమ్. అంకుల్ మీరు వసుధార తెలుసా అంటాడు గౌతమ్. తన టాపిక్ అవసరమా అంటే ఆమె అంటే తెలియని వాళ్లు కాలేజీలో ఎవ్వరూ ఉండరంటాడు మహేంద్ర. తనంత స్పెషలా అని గౌతమ్ అంటే రిషి నీకు టాపిక్కే దొరకలేదా అంటాడు. పొద్దున్నే మంచి ప్లజెంట్ టాపిక్స్ మాట్లాడుకోవాలంటాడు గౌతమ్. నువ్వు మారలేదురా బాబు అని గౌతమ్ అంటే నువ్వు అలాగే ఉంటే జడ పదార్థంలా ఉండిపోతావ్ అంటాడు గౌతమ్. నీకు యంగ్ డాడి ఉండగా నువ్వే వాడుకోవడం లేదంటాడు గౌతమ్. థ్యాంక్యూ గౌతమ్ అని మహేంద్ర అనడంతో..డాడ్ మీరు వాడి వల్లో పడకండంటాడు రిషి. పొగిడితే మునగచెట్టు కాదు ముళ్లచెట్టు కూడా ఎక్కుతారన్న గౌతమ్..మీరు నిజంగా హ్యాండ్సమ్, సూపర్, యూనిట్, యాక్టివ్ అంటూ పొగిడేస్తాడు. అంకుల్ వసుధార ఫోన్ నంబర్ అడుగుతాడు గౌతమ్. అర్థమైందా డాడ్ ఆ పొగడ్తలు ఎందుకో ఇదీ వాడి ఎత్తుగడ అంటాడు రిషి.
Also Read: రిషి-వసుధార మధ్య చిచ్చుపెట్టేందుకు జగతిని టార్గెట్ చేసిన దేవయాని సక్సెస్ అయిందా.. గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే…
ఫోన్ నంబర్ కోసం మరీ అంత పొడుగుతానా ఇంటి అడ్రస్ కోసం అయితే ఆ మాత్రం పొడుగుతా అనుకో అన్న గౌతమ్ తో నువ్వు మామూలోడివి కాదంటాడు మహేంద్ర. అంకుల్ నంబర్ అంటే..నీకు అవసరమా అంటాడు రిషి. గాలి, వర్షం, చెట్లు అన్నీ అవసరమా అనుకుంటామా అని క్లాస్ వేస్తాడు గౌతమ్. చాలా ఎక్కువైందని రిషి అంటే ..అవసరానికి మించి అవసరం గురించి చెప్పినా వసుధార నంబర్ రాలేదంటే అంటూ రిషి ఫోన్ చేసుకుని వసు నంబర్ కోసం వెతుకుతాడు. పానీ పూరీ బండికి చక్రాలుంటాయి కానీ అది మన దగ్గరకు రాదు మనమే అక్కడకు వెళ్లాలంటూ వసుధార నంబర్ వెతుక్కుంటాడు. గౌతమ్ ఫోనివ్వు అంటూ రిషి లాక్కుంటాడు. పొగరు ఎవరు..ఇదే నంబర్ కి చాలాసార్లు ఫోన్ చేసినట్టుందంటాడు గౌతమ్. ఫోన్ పర్సనల్ అలా చూస్తే ఎలా అంటాడు రిషి. మనిద్దరం చెడ్డీ దోస్తులం మన మధ్య నో పర్సనల్ అంతా ఓపెన్ అంటాడు గౌతమ్. అంకుల్ మీ ఫోన్ ప్లీజ్ అంటే ఇవ్వకండి అంటాడు రిషి. రూమ్ లో ఉందని మహేంద్ర చెప్పడంతో వసు నంబర్ సంపాదించడం ఎలా అనే ఆలోచనలో పడతాడు గౌతమ్. ఇంతలో వసుధార తన బ్యాగులో ఉన్న కార్డులు చూసి ఇవి గౌతమ్ వి కదా అనుకుంటుంది. ఇంతలో గాడ్ నువ్వే దారిచూపించు అనుకునేలోగా ఫోన్ రింగవుతుంది. కాల్ లిఫ్ట్ చేయగానే హలో సార్ గుడ్ మార్నింగ్ నేను వసుధారని మాట్లాడుతున్నా అంటుంది. అక్కడున్న రిషి, మహేంద్ర షాక్ అవుతారు. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.
Also Read: అర్థరాత్రి వరకూ చాటింగ్, పొద్దున్నే గులాబీలతో స్వాగతం.. పట్టాలెక్కిన రిషి-వసుధార లవ్ ట్రాక్..
రేపటి ఎపిసోడ్ లో
శనివారం ఎపిసోడ్ లో గౌతమ్ కి కాల్ చేసిన వసుధార సార్ మీ కార్డ్స్ కొన్ని నా బ్యాగులో ఉండిపోయాయని అంటుంది. ఇది మీ నంబరేనా నేను సేవ్ చేసుకోవచ్చా అంటాడు. కార్డ్స్ ఎప్పుడు తీసుకుంటారని అడిగితే సాయంత్రం రెస్టారెంట్ కి వస్తా కాఫీ షేర్ చేసుకుందాం అంటాడు గౌతమ్. సరే అని వసు కాల్ కట్ చేస్తుంది. వసు నీకెందుకు కాల్ చేసిందని రిషి అడిగితే పర్సనల్ అంటాడు గౌతమ్. మొత్తానికి ఇగో మాస్టర్ కి ఇక చుక్కలే...
Also Read: నట్టింట్లో పెద్ద పెంట పెట్టిన మోనిత, కడిగేసిన ఆదిత్య.. రుద్రాణిని ఎదుర్కొనేందుకు సిద్ధపడిన దీప.. కార్తీకదీపం డిసెంబరు 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read: ఆ బిడ్డకు తండ్రిని నేను కాదన్న డాక్టర్ బాబు దగ్గరకే చేరిన వారసుడు- ప్రశ్నించిన దీప.. న్యాయం చేయాలంటూ అత్తింట్లో శోకాలు పెట్టిన మోనిత.. కార్తీకదీపం డిసెంబరు 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read: దీప చేతిలో మోనిత బిడ్డ, సౌందర్య ఇంట్లో మోనిత, టార్గెట్ ఫిక్స్ చేసిన రుద్రాణి.. కార్తీక దీపం బుధవారం ఎపిసోడ్ లో ట్విస్టులే ట్విస్టులు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి