స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 29, 2021గా ఉంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిక్రూట్‌మెంట్ 2021 ఖాళీల వివరాలు
అహ్మదాబాద్ (గుజరాతి): 354
బెంగళూరు (కన్నడ): 278
భోపాల్ (హిందీ): 214
చెన్నై (తమిళం): 276
జైపూర్ (హిందీ): 104
అర్హత ప్రమాణాలు..
ఆసక్తి గలవారు.. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. డిసెంబర్ 1, 2021 నాటికి కనీసం 2 సంవత్సరాల అనుభవం (పోస్ట్ ఎసెన్షియల్ అకడమిక్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్) ఉండాలి. ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన రెండో షెడ్యూల్‌లో జాబితా చేసిన ప్రాంతీయ, గ్రామీణ బ్యాంక్‌లో అధికారిగా పని చేసి ఉండాలి.
అయితే అభ్యర్థులు ఏ రాష్ట్రంలో.. దరఖాస్తు చేసుకుంటున్నారో.. ఆ రాష్ట్రంలోనిస్థానిక భాషలో ప్రావీణ్యం (చదవడం, రాయడం మరియు అర్థం చేసుకోవడం) ఉండాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా దరఖాస్తు చేసుకున్న రాష్ట్రంలోని స్థానిక భాష పరిజ్ఞానం కోసం పరీక్ష నిర్వహిస్తారు. ఒకవేళ 10వ లేదా 12వ తరగతి మార్క్ షీట్/సర్టిఫికేట్‌లో పైన పేర్కొన్న రాష్ట్రంలో స్థానిక భాష ఉన్నట్టైతే.. భాషా పరీక్షలో పాల్గొనాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 1, 2021 నాటికి, అభ్యర్థి వయస్సు 21 ఏళ్లలోపు ఉండకూడదు.. 30 ఏళ్లకు మించకూడదు. ప్రాథమిక జీతం సుమారుగా రూ. 36,000 ఉంటుంది. ప్రతి ఏడాది ఇంక్రిమెంట్ వస్తుంది.
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. వేరే విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ https://bank.sbi/careers ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత, అభ్యర్థులు అవసరమైన దరఖాస్తు రుసుం చెల్లించాలి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిక్రూట్‌మెంట్ 2021కి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 29, 2021గా గుర్తుంచుకోవాలి.
Also Read: UPSC CDS 2022 Notification: యూపీఎస్సీ సీడీఎస్ లో 341 ఉద్యోగాలు.. దరఖాస్తు ఎప్పటి నుంచి అంటే..
Also Read: East Coast Railway Recruitment 2022: రైల్వేలో ఉద్యోగాలు.. అర్హత, జీతం వివరాలు ఏంటో తెలుసా?
Also Read: SSC 2022 Exam Calendar: నిరుద్యోగులకు అలర్ట్.. 2022లో రాబోయే జాబ్ నోటిఫికేషన్లివే..
Also Read: AP SSC Exams: పదో తరగతి పరీక్షలపై ఏపీ కీలక నిర్ణయం... ఈ ఏడాది 7 పేపర్లతోనే పరీక్షల నిర్వహణ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి