పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు పరీక్ష పేపర్లను తగ్గించింది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలను 11 పేపర్లకు బదులు 7 పేపర్లే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు ఇచ్చారు. కోవిడ్ కారణంగా పదో తరగతి ఫైనల్ పరీక్షలను ఈ ఏడాది 7 పేపర్లకే కుదిస్తున్నట్లు తెలిపారు. 2021–22 విద్యాసంవత్సరంలో టెన్త్ పరీక్షలకు 6 లక్షల మంది హాజరవ్వనున్నారు. కరోనా కారణంగా 2019–20, 2020–21లో పది పబ్లిక్ పరీక్షలకు 11 పేపర్లకు బదులు 7కు కుదించారు. అయినా కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేకపోయారు. 2019–20 విద్యాసంవత్సరంలో విద్యార్థులందరినీ ఉత్తీర్ణులు చేశారు.
Also Read: ఆలయాల ప్రాంగణాల్లోని దుకాణాల వేలంలో హిందూయేతరులూ పాల్గొనవచ్చు.. సుప్రీంకోర్టు ఆదేశం !
సప్లిమెంటరీ పరీక్షలకూ 7 పేపర్లు
కరోనా కారణంగా 2020–21లో కూడా పది పరీక్షలను నిర్వహించలేదు. విద్యార్థులను ఆల్‌పాస్‌గా ప్రకటించారు. దీంతో విద్యార్థుల పై చదువులకు, ఉద్యోగాలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు వారి అంతర్గత మార్కుల బట్టి గ్రేడ్లు ప్రకటించారు. 2020లో 6,37,354 మంది, 2021లో 6,26,981 మంది పదో తరగతి విద్యార్థులకు అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు పదోతరగతిలో ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా ఏడు పేపర్లతోనే నిర్వహిస్తారు. సామాన్య శాస్త్రం మినహా అన్ని సబ్జెక్టులకూ ఒకే పేపరు నిర్వహిస్తారు. ప్రతీ పేపర్ లో మొత్తం 33 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. సామాన్య శాస్త్రంలో భౌతిక, రసాయన శాస్త్రాలు ఒకటిగా, జీవశాస్త్రం పేపర్లు ఒకటిగా ఇస్తారు. 100 మార్కుల పరీక్షకు 3.15 గంటల సమయం ఇవ్వగా... ప్రశ్నపత్రం చదువుకోవడానికి, రాసింది సరి చూసుకోవడానికి 15 నిమిషాలు, పరీక్ష రాయడానికి 3 గంటల సమయం ఉంటుంది. 7 పేపర్ల విధానాన్ని ఈ ఒక్క ఏడాదే అమలు మాత్రమే చేయనున్నారు. 2023 మార్చి నుంచి తిరిగి 11 పేపర్ల విధానం అమల్లోకి వస్తుంది.
Also Read: మద్యంపై వ్యాట్ తగ్గింపు.. ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు..! ఏ బ్రాండ్ ఎంత తగ్గనుందంటే ?
Also Read: మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో భారీ సభ...అమరావతిలో రాజధానికి వ్యతిరేకమని ప్రకటించిన మేధావులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి