SBI PO Prelims Result 2021: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రొబెషనరీ ఆఫీసర్ ప్రిలిమ్స్ 2021 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. నవంబర్ 20, 21, 27 తేదీలలో మూడు రోజులపాటు నిర్వహించిన ఎస్‌బీఐ పీవో ప్రిలిమ్స్ రిజల్ట్స్ (SBI PO Prelims 2021 Results) అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. 


కొన్ని నెలల కిందట భారతీయ స్టేట్ బ్యాంక్ 2,056 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఎస్సీ కేటగిరిలో 324 పోస్టులు, షెడ్యూల్డ్ తెగలకు 162 పోస్టులు, ఇతర వెనుకబడిన తరగతులైన ఓబీసీలకు 560 పోస్టులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి (EWS)కు 200 కేటాయించగా.. జనరల్ కేటగిరిలో మిగతా 810 ఖాళీలు భర్తీ చేయనున్నామని ఎస్‌బీఐ పీవో జాబ్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.


SBI PO Prelims Result 2021: ఎస్‌బీఐ పీవో ప్రిలిమ్స్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోవాలి 



  • మొదటగా అధికారిక వెబ్‌సైట్ sbi.co.in. లింక్ ఓపెన్ చేయండి

  • వెబ్ సైట్ హోం పేజీలో Recruitment of Probationary Officers అనే లింక్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ ఇవ్వండి

  • లేదా ఫలితాల కోసం ఇచ్చిన డైరెక్ట్ వెబ్ లింక్  check SBI PO Prelims Result 2021  ఎంచుకోండి 

  • మీ రోల్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి

  • ఎస్‌బీఐ పీవో ప్రిలిమ్స్ రిజల్ట్స్ స్క్కీన్ మీద కనిపిస్తాయి

  • ఇప్పుడు మీరు మీ మార్కు షీట్‌ను డౌన్ లోడ్ చేసుకోవడం బెటర్. తరువాత ఎప్పుడైనా దీని అవసరం మీకు రావచ్చు


Also Read: BEL Recruitment 2021: హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగ అవకాశాలు.. అప్లై చేసుకోండిలా.. 


ప్రస్తుతం విడుదలైన ఎస్‌బీఐ పీవో ప్రిలిమ్స్ ఫలితాలను మెయిన్స్‌కు అర్హత సాధించేందుకు మాత్రమే పరగిణనలోకి తీసుకుంటారు. జాబ్ ఫైనల్ రిపోర్టులో ప్రిలిమ్స్ మార్కులు, పర్సెంటేజీలను లెక్కలోకి తీసుకోరని మెయిన్స్ రిజల్ట్స్ మీద ఆధారపడి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. మెయిన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే చివరగా ఇంటర్వ్యూలు నిర్వహించి తుది మెరిట్ జాబితా రూపొందిస్తారు. కేటగిరీల వారిగా ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిసిందే. ఎంపికైన వారికి నెలకు రూ.27,620 బేసిక్ శాలరీ, కాగా డీఏ, హెచ్‌ఆర్‌డీ, సీసీఏ, ఇతరత్రా అలవెన్స్‌లు అందుతాయి. 
Also Read: BSF Recruitment 2021: పదో తరగతి పాస్‌ అయిన వారికి బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగాలు.. డిసెంబర్‌ 29 లాస్ట్‌ డేట్‌


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి