హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్‌లోని యూనిట్‌లో ట్రైనీ, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 84 ఖాళీలకు గానూ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2021 డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు.. దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసిన పత్రాల్ని.. నోటిఫికేషన్ లో చెప్పిన్ అడ్రస్ కు చివరి తేదీలోపు పంపాలి.


బీఈ, బీటెక్, బీఎస్‌సీ (ఇంజనీరింగ్) పాస్ అయి ఉండాలి. ట్రైనీ ఇంజినీర్ పోస్టుకు ఏడాది, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు రెండేళ్ల అనుభవం ఉండాలి. 2021 డిసెంబర్ 31 నాటికి ట్రైనీ ఇంజినీర్ పోస్టుకు 25 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుకు 28 ఏళ్ల వయసుకు మించి ఉండకూడదు. ట్రైనీ ఇంజినీర్ పోస్టుకు రూ.200, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుకు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యంగులకు ఫీజు లేదు.


కాంట్రాక్ట్ గడువు.. ట్రైనీ ఇంజినీర్ పోస్టుకు ఒక ఏడాది. సంస్థ అవసరాలు, అభ్యర్థి పనితీరును బట్టి మూడేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు రెండేళ్లు. సంస్థ అవసరాలు, అభ్యర్థి పనితీరుతో నాలుగేళ్ల వరకు పొడిగించే ఛాన్స్ ఉంది. 
ట్రైనీ ఇంజనీర్‌కు మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది నెలకు రూ.28,000, మూడో ఏడాది నెలకు రూ.31,000 ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు మొదటి ఏడాది నెలకు రూ.35,000, రెండో ఏడాది నెలకు రూ.40,000, మూడో ఏడాది నెలకు రూ.45,000, నాలుగో ఏడాది నెలకు రూ.50,000 వరకు ఉంటుంది.


అభ్యర్థులు ముందుగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.  అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి ఆ రిసిప్ట్ ను కూడా జత చేయాలి. దరఖాస్తుల్ని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు 2021 డిసెంబర్ 31 లోగా పంపించాలి. 
దరఖాస్తులు పంపించాల్సి అడ్రస్ 
Dy. General Manager (HR),
Bharat Electronics Limited,
I.E.Nacharam,
Hyderabad- 500076,
Telangana.


Also Read: BSF Recruitment 2021: పదో తరగతి పాస్‌ అయిన వారికి బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగాలు.. డిసెంబర్‌ 29 లాస్ట్‌ డేట్‌


Also Read: CTET Exam 2021: సీటెట్‌ హాల్‌టికెట్‌ మీకు రాలేదా.. అప్లికేషన్ సరిదిద్దుకోండిలా


Also Read: Dream Job: కలల కొలువు.. సులువు కాదు.. రూ.2 కోట్ల వేతనం సాధించిన రైతు బిడ్డ!