ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోరాడి జీవితంలో విజయం సాధించాలని చాలా మంది అంటుంటారు. కానీ దాన్ని సాధించేవారు అతి కొద్ది మందే ఉంటారు. ఉత్తరాఖండ్‌కు చెందిన 22 సంవత్సరాల యువకుడు రోహిత్ నేగి దాన్ని సాధించి చూపించాడు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఉబెర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం అందుకున్నాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం సాధించడం ఏమైనా గొప్పా అనుకోవచ్చు. కానీ అతని వార్షిక వేతనం రూ.2.05 కోట్లు. అదే గొప్ప విషయం.


రోహిత్ ప్రస్తుతం గువాహటి ఐఐటీలో ఎంటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. చదువు పూర్తయిన వెంటనే ఉబెర్ ఇంటర్నేషనల్ సంస్థలో చేరిపోనున్నాడు. అతని బేసిక్ శాలరీనే రూ.96 లక్షలు కాగా, పూర్తి వార్షిక వేతనం రూ.2.05 కోట్లుగా ఉంది.


అయితే రైతు బిడ్డ అయిన రోహిత్‌కు ఈ కొలువు అంత సులువుగా దక్కలేదు. తమ తల్లిదండ్రులు కష్టపడి తనను చదివించారని అందుకే ఇప్పుడు తన కలలు నెరవేరాయని రోహిత్ అన్నాడు. ‘నేను దిగువ మధ్యతరగతి నుంచి వచ్చాను. నా కుటుంబం నెలవారీ ఖర్చులు రూ.10 వేలలోపే ఉంటాయి. మా నాన్న ఒక రైతు. తల్లి గృహిణి. నా సోదరి నర్సుగా పనిచేస్తుంది. ఇప్పుడు నా రూ.2.05 కోట్ల ప్యాకేజీ నా కుటుంబానికి ఎంతో గొప్పగా అనిపిస్తుంది. వారు చాలా సంతోషంగా ఉన్నారు.’ అని రోహిత్ అన్నాడు.


స్కూల్ చదువు పూర్తయ్యాక రోహిత్ ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో చేరాడు. అయితే మంచి గ్రేడ్స్ మాత్రం దక్కలేదు. కానీ, అతను ఎంతో కష్టపడి చదివి, గేట్‌లో మంచి ర్యాంకు సాధించాడు. దీంతో తనకి ఐఐటీ గువాహటిలో ఎంటెక్ సీట్ వచ్చింది.


ఇప్పుడు తాజాగా వస్తున్న కథనాల ప్రకారం.. కోట్‌ద్వార్ టౌన్‌షిప్‌లో ఎవరికీ అంత వేతనం రాలేదు. ఉబెర్‌లో తను ఎంపిక అవ్వడం అనేది మొదటి రోజే నిర్ణయం అయిపోయిందని ప్రొఫెసర్ డాక్టర్ అభిషేక్ అన్నారు. క్రమశిక్షణ, పట్టుదలకు హార్డ్‌వర్క్ తోడయితే విజయం దానంతట అదే వస్తుందనటానికి రోహిత్ పెద్ద ఉదాహరణ.


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: ఇదో వింత గ్రామం.. మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..

Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క


Also Read: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి