త్తర కొరియా.. ప్రపంచంతో సంబంధంలేని ఈ దేశంలో జీవించడం అంత ఈజీ కాదని మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. అక్కడ బతకాలంటే.. కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోవాలి. ఆ దేశంలో అభివృద్ధి చెందేది కేవలం.. నియంత కిమ్ జంగ్ ఉన్ కుటుంబం మాత్రమే. ఉత్తర కొరియాలో కిమ్ భోగాలు గురించి చెప్పుకుంటూ పోతే ఈ జీవితం సరిపోదేమో. మరి, అలాంటి సంపన్నుడికి భార్యగా వెళ్లాలంటే.. అమ్మాయిలకు ఎంతో అదృష్టం ఉండాలని మీరు అనుకుంటారేమో. కానీ, అతడికి భార్యగా వెళ్లడమంటే.. సింహం బోన్‌లోకి వెళ్లినట్లే. ప్రస్తుతం కిమ్ భార్య.. రి సోల్-జు పరిస్థితి కూడా అంతే. కిమ్‌.. ఆమెను పెళ్లి చేసుకున్న విధానాన్ని చూస్తే.. మనకు భోజ్‌పూరీ సినిమాల్లో విలన్.. హీరోయిన్‌ను ఎత్తుకుపోయే సీన్లు (బహుశా.. మీరు చూసి ఉండరు అనుకోండి).. గుర్తుకొస్తాయి. పెళ్లే అలా జరిగితే సంసారం ఎలా సాగి ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అసలే నియంత.. అందులో శాడిస్టు. కాదంటే చంపేస్తాడు.. ‘కిమ్’కర్తవ్యం అంటూ ఆమె ఎంతో ఆలోచించి ఉంటుంది కదూ. అసలు వారి పెళ్లి ఎలా జరిగింది.. పెళ్లి తర్వాత ఆమె పాటిస్తున్న రూల్స్ ఏమిటో ఓసారి చూసేద్దామా!


2012 నుంచి కిమ్ జంగ్-ఉన్ పక్కన ఓ యువతి కనిపించేది. మొదట్లో ఆమె ఎవరో తెలిసేది కాదు. బహుశా.. కొత్తగా ఏర్పాటు చేసుకున్న అసిస్టెంట్ కాబోలు అని అనుకున్నారు. చివరికి ఆమె మరెవ్వరో కాదు.. సాక్షాత్తు కిమ్ బాబు భార్య అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. వాళ్లకు పెళ్లి జరిగిన దాదాపు మూడేళ్ల తర్వాత ఆమె ప్రజలకు, మీడియాకు కనిపించింది. మరి, ఇన్నాళ్లు ఎందుకు కనిపించలేదని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే.. ఆమె పిల్లలను కనడంలో బిజీగా ఉంది. వాస్తవానికి.. ఆమె ప్రెగ్నేన్సీ న్యూస్ బయటకు తెలియకూడదు అనేది మొదటి రూల్. అలాగే, గర్భం దాల్చిన తర్వాత కూడా ఆమెకు బయటకు కనిపించకూడదు. పిల్లలను కూడా చూపించకూడదు. 


తండ్రికి నచ్చిందని..: కిమ్ భార్య రి సాల్-జు మంచి గాయని, చీర్ లీడర్. ఏదో ఓ కార్యక్రమంలో కిమ్ తండ్రి, నియంత కిమ్ జంగ్ ఇల్ ఆమెను చూశాడు. 2008లో గుండె నొప్పితో బాధపడుతున్న ఇల్.. ఆమెను పెళ్లి చేసుకోవాలని కిమ్‌కు ఆదేశించాడు. దీంతో కిమ్ ఆమెను 2009లో బలవంతంగా పెళ్లి చేసుకున్నాడనేది ఆసియా మీడియాల కథనం.  
పెళ్లి తర్వాత పేరు మార్పు: పెళ్లి తర్వాత కొంతమంది మహిళలు తమ ఇంటి పేరును మార్చుకోవడం సాధారణమే. అయితే, కిమ్ మాత్రం ఆమె పూర్తి పేరునే మార్చేశాడు. అంతేకాదు.. ఆమె గతాన్ని కూడా పూర్తిగా చెరిపేశారు. ఆమె పుట్టిన రోజు, పేరు వివరాలు బయట పెట్టకూడదని తల్లిదండ్రులను ఆదేశించాడు.
పుట్టింటివారిని కలవడమూ కష్టమే..: రి సాల్ జుకు కనీసం అత్తింటి కష్టాలను తల్లిదండ్రులకు చెప్పుకోవడానికి కూడా లేదు. రి సాల్ సంపన్న కుటుంబానికి చెందినదే. ఆమె తల్లి ఓ హాస్పిటల్‌లో గైనకాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్. ఆమె తండ్రి ఒక ప్రొఫెసర్. అయితే, పెళ్లయిన రోజు నుంచి ఆమె తన తల్లిదండ్రులను కలవలేదట.
కిమ్ ఎంపిక చేసిన దుస్తులే ధరించాలి..: పెళ్లయిన కొత్తలో కిమ్ భార్య.. వెస్ట్రన్ స్టైల్‌లో కనిపించింది. ఆ తర్వాత ఆమెను జీన్స్ వేసుకోవద్దని ఆంక్షలు విధించారు. ఆ తర్వాత ఆమె బయటకు వచ్చినప్పుడు కిమ్ సూచించిన దుస్తులే వేసుకోవాలి. చివరికి హెయిర్ స్టైల్‌ కూడా కిమ్‌కు నచ్చినట్లే ఉండాలి. 
ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి వీల్లేదు: కిమ్ భార్య తనంతట తానే ఒంటరిగా బయటకు వెళ్లడానికి లేదు. ప్రజలను కూడా కలవకూడదు. కేవలం భర్తతో మాత్రమే బయటకు వెళ్లాలి. పబ్లిక్ ఇవెంట్స్‌కు సైతం భర్తతో కలిసే వెళ్లాలి. ఆమెను ఎవరూ ప్రత్యేకంగా ఆహ్వానించకూడదు. 
ఉత్తర కొరియాను వదిలి వెళ్లకూడదు: భర్త అనుమతి లేకుండా లేదా అతడి తోడు లేకుండా ఆమె దేశాన్ని విడిచి వెళ్లకూడదు. ఆమె దేశాన్ని వదిలి వెళ్లడానికి ఎలాగో కిమ్ అనుమతి ఇవ్వడు. దీంతో ఆమె కేవలం అతడితో మాత్రమే వెళ్లాలి. అయితే, కిమ్‌తో పెళ్లికాక ముందు ఆమె చైనాలో ఉండేదని, అక్కడే చదువుకుందని స్థానిక మీడియా కథనం. చీర్ లీడర్‌గా ఉన్నప్పుడు ఆమె శత్రు దేశమైన దక్షిణ కొరియా కూడా వెళ్లిందట.
ప్రెగ్నెన్సీ కూడా రహస్యమే: ఆమె గర్భం దాల్చిన విషయాన్ని కూడా కిమ్ బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తపడేవాడు. ఆమె గర్భవతి అని తెలియగానే చుట్టుపక్కల భద్రత కట్టుదిట్టం చేసేవాడు. ఇంట్లో పనివారిని సైతం బయటకు పంపేవాడు కాదట. డెలవరీ అయ్యే వరకు ఆమె తన బంగ్లా నుంచి బయటకు రాకూడదు.


Also Read: కోవిడ్-19 కొత్త వేరియెంట్ ‘ఒమిక్రాన్’.. ఇది డేల్టా కంటే డేంజరా? లక్షణాలేమిటీ?


మగ పిల్లాడు పుట్టేవరకు..: కిమ్, రి సాల్‌లకు 2009లో పెళ్లయ్యింది. మొదటి బిడ్డ 2010లో పుట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో బిడ్డ పుట్టింది. అయితే, ఇద్దరు ఆడ పిల్లలే పుట్టడంతో కిమ్ సంతోషించలేదట. మగ పిల్లాడు పుట్టేవరకు పిల్లలను కనాలని ఆదేశించాడట. కొన్నాళ్ల కిందట ఆమె మరో బిడ్డకు జన్మనిచ్చిందని తెలిసింది. అయితే, పుట్టింది మగ బిడ్డ, ఆడ బిడ్డ అనేది బయటకు ప్రకటించలేదు. ఆమె మగ బిడ్డ జన్మించినట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. 


Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా? 
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?
Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి