యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ నోటిఫికేషన్ (CDS)లో ఖాళీలను భర్తి చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 11గా ఉంది. దరఖాస్తులను జనవరి 18 నుంచి జనవరి 24 సాయంత్రం 6 గంటల వరకు ఉపసంహరించుకోవచ్చు. అభ్యర్థులు upsconline.nic.in.in అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. UPSC CDS-I ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ప్రవేశానికి ఏప్రిల్ 10న పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది మొత్తం 341 ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేశారు.


పోస్ట్‌లకు అర్హత సాధించడానికి అభ్యర్థులు వ్రాత పరీక్షను క్లియర్ చేయాలి. ఆపై ఇంటర్వ్యూ మరియు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. సెలక్ట్ అయిన అభ్యర్థికి బోర్డ్ ఆఫ్ సర్వీస్ మెడికల్ ఆఫీసర్స్ వైద్య పరీక్ష (స్పెషల్ మెడికల్ బోర్డ్) నిర్వహిస్తారు. మెడికల్ బోర్డ్ ద్వారా ఫిట్‌గా ఉన్న అభ్యర్థులు మాత్రమే అకాడమీకి ప్రవేశం కల్పిస్తారు.


అర్హతలు..
మిలటరీ అకాడమీ కోసం జనవరి 2, 1999 నుంచి జనవరి 1, 2004లోపు జన్మించిన అవివాహిత పురుష అభ్యర్థులు అర్హులు. ఇండియన్ నేవల్ అకాడమీ కోసం జనవరి 2, 1999 నుంచి ముందు మరియు 1 జనవరి 2004లోపు జన్మించిన అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఎయిర్ ఫోర్స్ కు 20 నుంచి 24 మధ్య వయసున్న వాళ్లు అర్హులు.


ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం.. దరఖాస్తుదారులు ఏదైనా డిగ్రీ ఉండాలి. ఇండియన్ నేవల్ అకాడమీకి, దరఖాస్తుదారులు ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీకి, దరఖాస్తుదారులు భౌతిక శాస్త్రం మరియు గణితంలో డిగ్రీని కలిగి ఉండాలి.


ఎలా దరఖాస్తు చేయాలి


స్టెప్-1: అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
స్టెప్-2: అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి
స్టెప్-3: ఆధారాలను ఉపయోగించి లాగిన్ చేయాలి
స్టెప్-4: ఫారమ్‌ను పూరించి.., సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి
స్టెప్ 5: ఫీజు చెల్లింపు చేసి.. సబ్మిట్ కొట్టాలి
 
దరఖాస్తుదారులు రూ. 200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మరియు ఎస్సీ, ఎస్టీలు ఫీజు మినహాయింపు ఉంటుంది.
అన్ని సబ్జెక్టుల పేపర్లలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ మరియు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ప్రశ్న పత్రాలు హిందీతో పాటు ఇంగ్లీషులో సెట్ చేసి ఉంటాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు సమాధానాలు ఇస్తారు. అందులో సరైనది ఎంపిక చేసుకోవాలి. అభ్యర్థి తప్పుగా సమాధానం ఇస్తే.. ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులలో మూడింట ఒక వంతు (0.33) నెగెటివ్ మార్కులు ఉంటాయి. 
ఎంపికైన అభ్యర్థులను లెఫ్టినెంట్ పోస్ట్‌లో నియమిస్తారు. రూ. 56,100 - రూ. 1,77,500 పరిధిలో నెలవారీ జీతం ఉంటుంది. సర్వీస్ అకాడమీలోని శిక్షణ కాలంలో స్టైపెండ్ నెలకు రూ. 56,100 ఉంటుంది.


Also Read: East Coast Railway Recruitment 2022: రైల్వేలో ఉద్యోగాలు.. అర్హత, జీతం వివరాలు ఏంటో తెలుసా?


Also Read: DRDO Recruitment 2021: డీఆర్డీఓలో ఉద్యోగాలు.. మెరిట్ ఉంటే మీకే ఉద్యోగం..