నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో)లో పలు ఉద్యోగాల భర్తీకి కోసం దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 20 ఆఖరి తేదీగా నిర్ణయించారు. సంస్థకు చెందిన టెర్మినల్ బాలిస్టిక్ రిసెర్చ్ లాబొరేటరిలో 61 ఖాళీలను అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేస్తుంది. అయితే.. ఇవాళే చివరి తేదీగా ఉంది. దీనికోసం ఎలాంటి పరీక్షను నిర్వహించరు.. కేవలం మెరిట్ ఆధారంగానే.. ఎంపిక చేయనున్నట్టునోటిఫికేషన్ లో తెలిపారు.
డీఆర్డీవోలో ఎంపికైన వారు.. ఏడాది పాటు.. అప్రంటీస్ గా పనిచేయాలి. ఎంపికైన వారికి ఉపకారవేతనంగా నెలకు రూ. 8050 ఇస్తారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు డిసెంబర్ 20 చివరి తేదీ. మొత్తం 61 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ కింద ఇచ్చిన.. ట్రైడ్ లలో ఐటీఐ చేసి ఉండాలి.
డ్రాట్స్ మెన్, మెకానిక్ మెకాట్రానిక్స్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్, మెకానిక్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్(సివిల్), హౌస్ కీపర్, ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ మోటర్ వెహికిల్, వెల్డర్, కంప్యూటర్ పెరిఫిరల్స్ హార్డ్ వేర్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డిజిటల్ ఫొటోగ్రాఫర్, సెక్రెటేరియల్ అసిస్టెంట్, స్టేనోగ్రాఫర్ కు సంబంధించిన ట్రేడ్ లలో ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్థులు NAPS పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు apprenticeshipindia.org పోర్టల్ లో రిజిస్టర్ అయ్యి.. కావాల్సిన పత్రాలు అప్ లోడ్ చేయాలి. ఆ తర్వాత టెన్త్ క్లాస్ మార్క్ షీట్, ఐటీఐ మార్క్స్ షీట్, కాస్ట్ సర్టిఫికేట్, ఐడీ ప్రూఫ్ స్కానింగ్ కాపీలను సింగిల్ పీడీఎఫ్ ఫైల్ లో admintbrI@tbrl.drdo.in మెయిల్ చేయాలి.
Also Read: SSC 2022 Exam Calendar: నిరుద్యోగులకు అలర్ట్.. 2022లో రాబోయే జాబ్ నోటిఫికేషన్లివే..
Also Read: NVS Recruitment: నవోదయ విద్యాలయ సమితిలో ఉద్యోగాలు.. సెలక్ట్ అయితే భారీగా జీతం
Also Read: TS Inter Results : కరోనా కాలం చదవులా ? ఇంటర్ బోర్డు పొరపాటా? వివాదంగా మారిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు !