సీబీఎస్ఈ  10వ తరగతి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు లిటరేచర్ పేపర్‌లలో ఒక సెట్‌లోని ఒక కాంప్రహెన్సివ్ ప్యాసేజ్.. ఇటీవల వివాదానికి దారితీసింది. అయితే వెంటనే సీబీఎస్ఈ బోర్డు పేపర్‌లోని ప్యాసేజ్‌ను తొలగిస్తున్నట్టు, ఆ ప్రశ్నకు విద్యార్థులకు పూర్తి మార్కులను ఇస్తున్నట్టు ప్రకటించింది.  


ఆ ప్యాసేజీలోని వ్యాఖ్యలు.. మహిళా సమానత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని.. విమర్శలు వచ్చాయి. శనివారం నిర్వహించిన ఈ పరీక్ష ప్రశ్నాపత్రంలో 'మహిళా విమోచనం వల్ల పిల్లలపై తల్లిదండ్రుల అదుపాజ్ఞలు దెబ్బతింటున్నాయి', 'భర్త అడుగుజాడల్లో నడవడం ద్వారానే ఒక తల్లి తన పిల్లల నుంచి విధేయత వంటివాటిని పొందగలుగుతుంది' వంటి అంశాలున్నాయి.


ఇంగ్లీష్​ పరీక్ష ప్రశ్నాపత్రంపై తలెత్తిన వివాదం పార్లమెంటులో కూడా ప్రస్తావనకు వచ్చింది. ప్రశ్నాపత్రంలోని ఓ వ్యాసం అభ్యంతరకర రీతిలో ఉందని, మోదీ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని కూడా సోనియా గాంధీ డిమాండ్​ చేశారు.


'ఈ దురదృష్టకర సంఘటనకు మేము చింతిస్తున్నాం. ఇప్పుడు బోర్డు ద్వారా నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తాం. ఇది ప్రశ్న పత్రాన్ని సెట్ చేసే మొత్తం ప్రక్రియను సమీక్షిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా మరింత పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం' ట్విట్టర్‌లో ట్విట్టర్ సీబీఎస్ఈ విచారం వ్యక్తం చేసింది. 


సీబీఎస్ఈ పేపర్ ఎలా ప్రిపేర్ అవుతుందో తెలుసా?


పేపర్‌ను సిద్ధం చేయడానికి ఒక సబ్జెక్టుకు చెందిన ముగ్గురు లేదా నలుగురు నిపుణులను సీబీఎస్ఈ ఎంపిక చేస్తుంది. వారిలో ప్రతి ఒక్కరూ ఓ పేపర్ సెట్‌ను తయారు చేస్తారు. ఈ పేపర్ సెట్‌లు ఆమోదం కోసం పంపిస్తారు. అందులోని  ఒకదాన్ని బోర్డు ఎంపిక చేస్తుంది.పేపర్లు చాలా కష్టంగా లేవని నిర్ధారించేందుకు మోడరేటర్లు మరియు నిపుణుల బృందానికి కూడా పంపిస్తారు. సిలబస్ నుంచి మాత్రమే ప్రశ్నలు అడుగుతారు. ఆపై సీబీఎస్ఈ ద్వారా ఎంపిక చేసిన పేపర్ చివరి సెట్లు హిందీలో అనువాదం కోసం పంపిస్తారు.


ఈ పేపర్స్ సీలు చేసి అన్ని ప్రాంతీయ కార్యాలయాలకు పంపుతారు. కొన్ని సెట్ల కాపీలు బోర్డు బ్యాకప్‌గా ఉంచుతుంది. భవిష్యత్ లో ఉపయోగపడొచ్చనే ఉద్దేశంతో దాచి పెడుతుంది. ప్రాంతీయ అధికారులు నుంచి పరీక్ష రోజున పాఠశాలలకు వెళ్తాయి. పరీక్ష ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు మాత్రమే వాటి సీల్ తీస్తారు.


Also Read: Miss Universe: మన ముగ్గురు విశ్వ సుందరుల చదువేంటో తెలుసా?


Also Read: UGC Net 2021: యూజీసీ నెట్ సెకండ్ ఫేజ్ పరీక్ష తేదీలు విడుదల.. అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సి విషయాలివే


Also Read: CTET Exam 2021: సీటెట్‌ హాల్‌టికెట్‌ మీకు రాలేదా.. అప్లికేషన్ సరిదిద్దుకోండిలా