యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. పలు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మెుత్తం 187 పోస్టులకు ఈ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అసిస్టెంట్ కమిషన్ 2, అసిస్టెంట్ ఇంజనీర్ 157, జూనియర్ టైం స్కేల్ ఆఫీసర్ 17, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 9, అసిస్టెంట్ ప్రొఫెసర్ 2 పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అసిస్టెంట్ కమిషన్(క్రాప్స్) పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారు.. సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. దానికి చెందిన పనిలో మూడేళ్ల అనుభవం ఉండాలి. 40 ఏళ్ల వయసుకు మించకుండా ఉండాలి.
అసిస్టెంట్ ఇంజనీర్(క్వాలిటీ అష్యూరెన్స్) పోస్టుకు దరఖాస్తు చేయాలనుకునేవారు.. సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. కనీసం రెండేళ్ల ప్రాక్టికల్ అనుభవం ఉండాలి. 30 ఏళ్లకు మించి వయసు ఉండకూడదు.
జూనియర్ టైం స్కేల్ ఆఫీసర్(సెంట్రల్ లేబర్ సర్వీస్) పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత అయి ఉండాలి. వయసు.. 35 ఏళ్లకు మించకుండా ఉండాలి.
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) పోస్టుకు అప్లై చేసుకునేవారు.. బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.
అసిస్టెంట్ ప్రొఫెసర్ కు అప్లై చేసుకునే అభ్యర్థులు.. సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ(ఆయుర్వేద), పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. 45 ఏళ్లకు మించి వయసు ఉండకూడదు.
రిక్రూట్ మెంట్ పరీక్ష ఆధారంగా .. ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 13.01.2022వరకు దరఖాస్తు చేసుకోవాలి.
Also Read: ONGC Recruitment 2021: ఓఎన్జీసీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు జనవరి 4న చివరి తేదీ.. అప్లై చేసుకోండిలా..
Aslo Read: కమిటీ నివేదిక వచ్చాక తుది టిక్కెట్ ధరల ఖరారు - డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో పేర్ని నాని ప్రకటన !
Also Read: East Coast Railway Recruitment 2022: రైల్వేలో ఉద్యోగాలు.. అర్హత, జీతం వివరాలు ఏంటో తెలుసా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి