అగ్రరాజ్యం అమెరికా మరోసారి వైరస్  గుప్పిట్లో చిక్కుకుంటోంది. ఆ దేశంలో డెల్టా, ఒమిక్రాన్ వైరస్ సునామీ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పౌరులందరికీ దాదాపుగా వ్యాక్సిన్లు అందించినప్పటికీ అమెరికాను వైరస్ మళ్లీ ముంచెత్తుతోంది. ఓ వైపు డెల్టా కేసులు.., మరో వైపు ఒమిక్రాన్ కేసులు పెద్ద ఎత్తున వెలుగు చూస్తున్నాయి. దీంతో అనేక రాష్ట్రాలు ఆంక్షల బాటలోకి వెళ్తున్నాయి. అమెరికాలో ఒక్క రోజులో ఐదు లక్షలకుపై కరోనా కే్సులు నమోదయ్యాయి. ఇందులో సగం డెల్టా వేరియంట్ కాగా.., మరో సగం ఒమిక్రాన్ రకం వైరస్ . 


Also Read: కొద్దిరోజుల్లో TSలో తార స్థాయికి ఒమిక్రాన్.. 90 శాతం మందికి లక్షణాల్లేవు: డీహెచ్


డిసెంబర్‌ 25తో ముగిసిన వారంలో నమోదైన కొత్త కేసుల్లో 58.6 శాతం ఒమిక్రాన్‌ కేసులే ఉన్నాయని అమెరికా ఆరోగ్య విభాగం ప్రకటిచింది.  వారం రోజుల్లో సగటున రోజుకు 2.40 లక్షలకు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అది ఈ వారం డబుల్ అయింది. రోజుకు ఐదు లక్షల కేసుల వరకూ నమోదవుతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి అధికంగానే ఉందని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.  అయితే ఆసుపత్రుల్లో చేరే ముప్పు తక్కువగానే ఉందని .. చెబుతోంది. 


Also Read: ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ పర్యటన వాయిదా.. కారణమిదే!


ఇప్పటి వరకు కాలిఫోర్నియా రాష్ట్రంలో 50 లక్షలకు పైగా కేసులు వెలుగుచూశాయి. ఇన్ని కేసులు వచ్చిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఒక్క కాలిఫోర్నియాలోనే 75,500 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ కొత్త వేరియంట్‌ ఉధృతి కారణంగా కొన్ని వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు చేస్తున్నారు. అమెరికాలో ఇప్పుడు పలు రాష్ట్రాల్లో ఆందోళన కర పరిస్థితి నెలకొంది.. చాలా చోట్ల టెస్ట్ కిట్లు కూడా లభించడం లేదు. అనేక ఆరోగ్య కేంద్రాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 


Also Read: 60 ఏళ్ల పైబడిన వారికి ప్రికాషన్ డోస్ కోసం.. మెడికల్ సర్టిఫికెట్ అవసరం లేదు


గతంలో లాక్ డౌన్ సమయంలో  పడిన కష్టాలను గుర్తు తెచ్చుకుని ప్రజలు ఇప్పటి నుండే జాగ్రత్త పడుతున్నారు. రోజుకు ఐదు లక్షల కేసులు నమోదవుతున్నందున మళ్లీ లాక్ డౌన్ విధిస్తారేమోనని భావిస్తున్నారు. అయితే కొత్త వైరస్ కారణంగా ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం ఉన్న వాళ్లు కొంత మందే ఉంటున్నారు. ఈ కారణంగా అమెరికా ప్రభుత్వం కూడా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉందా లేదా అని నిపుణులు లెక్కలేస్తున్నారు. 


Also Read: టెస్ట్‌ ఎర్లీ, ట్రేస్‌ ఎర్లీ, ట్రీట్‌ ఎర్లీ ... ఒమిక్రాన్‌పై అధికారులకు సీఎం జగన్ రూట్ మ్యాప్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి