60 ఏళ్లు పైబడిన వారు డాక్టర్ నుంచి మెడికల్ సర్టిఫికేట్ లేకుండా ప్రికాషన్ డోస్(ముందు జాగ్రత్త మోతాదు) పొందవచ్చని కేంద్రం స్పష్టం చేసింది అయితే.. వారు  డోస్ తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని చెప్పింది. '60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, సహ-అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు.. ప్రికాషన్ డోస్ కోసం.. డాక్టర్ నుంచి ఏదైనా ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఏదైనా సమస్యగా అనిపిస్తే.. వైద్యుడి సంప్రదించండి.' అని ఆరోగ్య కార్యదర్శి రాకేష్ భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాశారు.


ఎలక్షన్ డ్యూటీ కోసం వెళ్లేవారు.. ఫ్రంట్ లైన్ వారియర్స్ కిందకు వస్తారని రాకేష్ భూషణ్ చెప్పారు. వాళ్లు ప్రికాషన్ డోసు తీసుకోవాలన్నారు. రెండో డోస్ ఎప్పుడు తీసుకున్నారనే దాని ఆధారంగా ప్రికాషన్.. డోస్‌కు అర్హత ఉంటుందని  వెల్లడించారు. రెండో డోస్ తర్వాత తొమ్మిది నెలల తర్వాత మాత్రమే వ్యాక్సిన్ వేసుకోవాలని పేర్కొన్నారు.


డిసెంబరు 25న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి జాతినుద్దేశించి మాట్లాడారు.  2022 జనవరి 10 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లతోపాటు.. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోస్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పెరుగుతున్న నేపథ్యంలో..  ప్రధాని ఈ ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోసు ఉంటుందని తెలిపారు. అయితే ఆ సమయంలో..  వైద్యుడి వద్ద సర్టిఫికెట్ తీసుకురావాలనే ఆలోచన ఉండేది.. అయితే తాజాగా కేంద్రం ప్రికాషన్ డోసుకు ఎలాంటి సర్టిఫికెట్ అవసరం లేదని చెప్పింది. 


ఈ ముందు జాగ్రత్త మోతాదు 9 నెలల తర్వాతనే తీసుకోవాలి. అంటే.. రెండవ డోస్ ఇచ్చిన తేదీ నుండి 39 వారాలు పూర్తి అయిపోయి ఉండాలి. కొవిన్‌ పోర్టల్‌లోనే ప్రికాషన్ డోసు కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.  దేశంలో కనీసం 13.7 కోట్ల మంది ప్రికాషన్‌ డోసుకు అర్హులని తెలుస్తోంది.


Also Read: Omicron Guidelines: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు... కేరళ, ఉత్తరాఖండ్ లో నైట్ కర్ఫ్యూ... కోవిడ్ నియంత్రణ చర్యలు పొడిగింపు


Also Read: MP Corruption : ఎన్నికల ఖర్చుల వరకూ అవినీతికి పాల్పడవచ్చట.. ఈ బీజేపీ ఎంపీ నిజాయితీ మిమ్మల్ని అవాక్కయ్యేలా చేస్తుంది !


Also Read: Actress Suicide: ఆ కేసులో ఇరికిస్తారనే భయంతో యువనటి ఆత్మహత్య.. అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంతో దారుణం.. చివర్లో ట్విస్ట్


 


Also Read: