ఎంపీగా గెలవాలంటే ఎంత ఖర్చు పెట్టాలి ? తెలుగు రాష్ట్రాల్లో అయితే కనీసం రూ. యాభై  కోట్లు ఖర్చు పెట్టాలి. మరి  దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలి.  అవినీతి  చేస్తే తప్ప అంత మొత్తం వెనక్కి రాదు. అయితే ఆ విషయాన్ని ఎంపీలు ఒప్పుకుంటారా..?.  చచ్చినా ఒప్పుకోరు. కానీ ఓ బీజేపీ ఎంపీ మాత్రం ఒప్పుకున్నారు. కాకపోతే ఆయన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీ కాదు.. మధ్య.ప్రదేశ్ ఎంపీ.  ఆయన తాను ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టాను.. వచ్చే ఎన్నికల్లో ఎంత ఖర్చు పెడతానో లెక్క చెప్పి మరీ... దానికి ఓ లక్ష అదనంగా అవినీతి చేస్తే తప్పు లేదని కవర్ చేసుకున్నారు. 





Also Read: మోడీ కాన్వాయ్‌లో కొత్త బెంజ్ కారు.. ఖరీదు రూ. 12 కోట్లపైనే..! దీని స్పెషాలిటీస్ తెలుసా ?
 
మధ్యప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎంపి జనార్ధన్‌ మిశ్రా రాజకీయ నేతల అవినీతి తప్పు కాదనేశారు.. అయితే అవినీతికి కొంత పరిధంటూ ఉందని చెప్పుకొచ్చారు. గడిచిన ఎన్నికల్లో చేసిన ఖర్చు, వచ్చే ఎన్నికల్లో చేయాల్సిన ఖర్చులతో పాటు మరికొంత ఖర్చును లెక్కగట్టి.. ఆ మేరకు అవినీతి చేయచ్చు అంటూ మధ్యప్రదేశ్‌లోని రెవా జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో బహిరంగంగా వ్యాఖ్యానించారు.   దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. 


Also Read: సన్నీ లియోన్ సాంగ్ పై హోం మినిస్టర్ ఫైర్.. మూడు రోజుల్లో ఆ పని చేయకుంటే..


సోమవారం నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గోన్న ఆయన.. స్థానిక నేతలపై వస్తున్న అవినీతి గురించి స్పందించారు. సర్పంచ్‌ రూ. 15 లక్షలు అవినీతికి పాల్పడ్డాడని ప్రజలు ఆరోపిస్తున్నారని, దీనికే తమకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదని, అంతకు మించి అవినీతికి పాల్పడితే తమ వద్దకు రావాలంటూ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో 7 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయని, వచ్చే ఎన్నికలకు మరో 7 లక్షలు కావాలని, ద్రవ్యోల్బణం పెరిగితే ఇంకో లక్ష పెరగొచ్చని ఎంపి బహిరంగంగా వ్యాఖ్యానించారు. 


Also Read: కొత్త సంవత్సరం కానుక! జనవరి 1న రైతుల ఖాతాల్లో డబ్బులు వేయనున్న మోదీ


రాజకీయ నేతల అవినీతి  బహిరంగరహస్యం.  ఎన్నికల్లో ఖర్చుపెట్టే కోట్లకు కోట్లు వాళ్లు నిజాయితీగా సంపాదించే అవకాశం లేదు. అలా సంపాదిస్తే ఖర్చు పెట్టరు కూడా. ఆ అవినీతి నేతల్లో జనార్ధన్ మిశ్రా భిన్నమైన వ్యక్తి అనుకోవచ్చు. కేవలం ఎన్నికల ఖర్చుల వరకూ అవినీతి చేస్తే తప్పు లేదంటున్నారు. కానీ దేశంలో ఉన్న అత్యధిక రాజకీయ నేతలు ఎన్నికల్లో పెట్టిన పెట్టుబడికి మించి లాభాలుగా అవినీతికి పాల్పడేవాళ్లు మరి. వాళ్లతో పోలిస్తే మిశ్రా కాస్త మనసున్న అవినీతి పరుడని అనుకోవాలి. 


Also Read: ఆ కేసులో ఇరికిస్తారనే భయంతో యువనటి ఆత్మహత్య.. అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంతో దారుణం.. చివర్లో ట్విస్ట్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి