ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎయిర్‌ఫోర్స్ వన్ తరహాలో ఓ ప్రత్యేక విమానాన్ని సిద్దం చేయించారు. ఆ విమానం స్పెషాలిటీస్ అన్నీ హైలెట్ అయ్యాయి. ఇప్పుడు కొత్తగా కాన్వాయ్‌లోకి ఓ బెంజ్ కారు వచ్చి చేరింది. ఆ కారు ప్రత్యేకతలు ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. రూ. 12 కోట్ల విలువైన ఆ కారులో ఉన్న ప్రత్యేకతలు ఇప్పుడు ఆటోమోబైల్ వరల్డ్‌లోనే కాదు.. సామాన్యుల్లోనూ హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రధాని కాన్వాయ్‌లో కొత్తగా చేరిన కారు మోడల్ మెర్సిడెజ్-మేబ్యాక్ ఎస్650 . దీని గురించి కేంద్రం ఎక్కడా ప్రకటించలేదు. కానీ ఇటీవల మోడీ కాన్వాయ్‌లో ఈ కారే ప్రత్యేకాకర్షణగా నిలుస్తూండటంతో హైలెట్ అయింది.
Also Read: టీవీ సీరియల్ చూస్తున్న ఇద్దరు మహిళలు.. ఎంచక్కా బంగారం దోచేసిన దొంగలు
ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌లో రేంజ్ రోవర్, ల్యాండ్ క్రూయిజర్, బీఎమ్‌డబ్ల్యూ-7 సిరీస్ కార్లు ఉన్నాయి. ఇప్పుడు మెర్సిడెజ్ మేబ్యాక్ వచ్చి చేరింది. ప్రధానమంత్రి భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఈ కారును సిద్ధం చేయించినట్లుగా తెలుస్తోంది. బాడీ పూర్తిగా ఇంటిగ్రేటెడ్ స్టీల్‌తో తయారు చేస్తారు. లిమోసిన్ విండోస్ లోపలి భాగంలో పాలికార్బోనేట్ కోటింగ్‌తో వస్తాయి. ల్యాండ్‌మైన్స్ నుంచి రక్షణ కోసం అండర్ బాడీలో భారీ అర్మర్స్‌ని పొందుపరిచారు.
వెహికల్ సెఫ్టీకి సంబంధించి ప్రపంచంలోనే అత్యధిక సెఫ్టీ రేటింగ్ ఈ బెంజ్ కారుకు ఉంది. ఈ కారు బాడీ, విండోస్ బుల్లెట్‌లను తట్టుకోగలిగే కెపాసిటీ ఉంది. అంతేకాకుండా ఎక్స్‌ప్లోజివ్ రెసిస్టెంట్ వెహికల్ విషయంలో 2010 రేటింగ్‌ను కలిగి ఉంది. దీంతో రెండు మీటర్ల దూరంలో 15 కిలోల టీఎన్‌టీలాంటి శక్తివంతమైన పేలుడు సంభవించిన కారులో ఉన్నవారికి భద్రత లభిస్తుంది. ఎవరైనా విషవాయువుతో దాడి చేసినా లోపల ఉన్నవారికి ఎటువంటి ప్రమాదం కలగకుండా స్వచ్ఛమైన గాలి అందించే ప్రత్యేక ఏర్పాటు ఈ కారులో ఉంటుంది.
ఫ్యూయల్ ట్యాంక్ ఒక ప్రత్యేక పదార్థంతో పూత ఉండగా...ఇది ఒకవేళ ఎదైనా మంటలు వ్యాపించినట్లయితే వెంటనే ఆటోమోటిక్‌గా ఫ్యూయల్ వాల్వ్ మూసుకుపోతాయి. ఇందు కోసం బోయింగ్ AH-64 అపాచీ హెలికాప్టర్ వాడే మెటిరియల్‌ను ఉపయోగించారు. దీంతో ఈ వాహనంలో అగ్ని ప్రమాదాలకు అవకాశం లేదు.ప్రధాని కాన్వాయ్‌లో రెండు మేబ్యాక్ ఎస్650 కార్లు ఉన్నాయి. ప్రధాని ఏ కారులో ప్రయాణించే విషయం అక్కడున్న సిబ్బందికి తప్ప ఎవ్వరికీ తెలియనివ్వరు. బెంజ్ కారు విలాసవంతమైన కార్ల తయారీలో ప్రసిద్ది చెందింది. అయితే ఈ సంస్థ ప్రపంచంలోని అనేక దేశాల అధినేతలకు ప్రత్యేక రక్షణలతో కూడిన వాహనాలను తయారు చేసి ఇస్తుంది.