తమిళనాడులోని కాంచీపురంలోని ఓ ఇంటిలో ఇద్దరు మహిళలు సీరియల్ చూస్తూ బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో దొంగచాటుగా ఇంట్లోకి చొరబడిన నలుగురు సభ్యుల ముఠా రూ.19 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
కేసు వివరాల ప్రకారం.. తమిళనాడులో ఆడిటర్‌గా పనిచేస్తున్న మెగానాథన్ భార్య.. తన బంధువుతో కలిసి కలిసి ఇంట్లో టీవీ సీరియల్ చూస్తోంది. ఇద్దరు మహిళలు మెయిన్ గేటుకు తాళం వేయలేదు. మరోవైపు చాలా ఎక్కువ వాల్యూమ్‌లో టీవీ సీరియల్ చూస్తున్నారు. ఇంతలో ముసుగు ధరించిన వ్యక్తులు దొంగచాటుగా ఇంట్లోకి చొరబడ్డారు. ఆ తర్వాత మహిళలను కత్తితో బెదిరించి.. తాళ్లతో కట్టేశారు. వారి దగ్గర నుంచి బీరువా తాళాలు తీసుకున్నారు. అనంతరం 19 లక్షల విలువ చేసే బంగారాన్ని పట్టుకుని వెళ్లారు. అయితే ఆడిటర్ మెగానాథన్ తోపాటు.. అతడి తమ్ముడు ఆ సమయంలో ఇంట్లో లేరు.
నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. నిందితులు ద్విచక్రవాహనాలపై ఇంటికి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది. ఇద్దరు గేటు బయట కాపలా ఉండగా, మరో ఇద్దరు దొంగచాటుగా లోపలికి చొరబడి దోపిడీకి పాల్పడ్డారు.
ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం తెల్లవారుజామున మరో ఘటన జరిగింది. రూ.8 లక్షలకు పైగా ఉన్న ఏటీఎం చోరీకి గురైంది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. టాటా ఇండిక్యాష్‌కు చెందిన ఈ ఏటీఎంను తొమ్మిదేళ్ల క్రితం ఫతేబాద్ రోడ్డులో ఏర్పాటు చేశారు. ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తుల బృందం తెల్లవారుజామున 2:40 గంటల ప్రాంతంలో దొంగిలించారు. అందులో మొత్తం రూ.8.20 లక్షలు ఉన్నాయి. విషయం తెలిసి.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసినందుకు ముగ్గురు సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
Also Read: Hyderabad: తల్లి కళ్లెదుటే కొడుకుల రక్తపాతం.. ఒకరు మృతి, కదల్లేని స్థితిలోనే మౌనంగా రోదిస్తూ..