ఐదో తరం (5G) టెలీకాం సర్వీసులు భారత్‌లో 2022లో ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాదిలో గురుగ్రామ్, బెంగళూరు, కోల్ కతా, ముంబయి, చండీగఢ్, ఢిల్లీ, జామ్ నగర్, అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, లక్నో, పుణె, గాంధీనగర్ నగరాల్లో 2022 ఏడాదిలో 5జీ ప్రారంభం కానుంది. అగ్ర స్థానంలో ఉన్న టెలీకాం సర్వీస్ ప్రొవైడర్లు అయిన భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా సంస్థలు ఇప్పటికే 5జీ సేవల ట్రయల్స్‌ను కొన్ని నగరాల్లో ప్రారంభించాయి. కొన్ని మెట్రో నగరాలు, పెద్ద సిటీల్లో 2022 ఏడాదిలో 5జీ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లుగా కేంద్ర టెలీకమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ సోమవారం ప్రకటించింది. 


ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4జీ సేవలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అందరూ ఈ సర్వీసులను ప్రస్తుతం వాడుతున్నారు. టెలీకాం సేవల్లో ఈ 4జీకి తర్వాతి తరమే 5జీ. 4జీ తో పోల్చితే అత్యధిక డేటా వేగం, డౌన్‌లోడ్, అప్ లోడ్ వంటివి 5జీలో పొందవచ్చు. ఈ అడ్వాన్స్‌డ్ సేవలను అత్యంత వేగంగా వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో టెలికాం సంస్థలు ఇప్పటికే 5జీ సేవలు అందించేందుకు సిద్ధమయ్యాయి. 


ప్రస్తుతం ఉన్న 4జీ సేవల కింద 250 ఎంపీపీఎస్ డేటా ట్రాన్స్‌ఫర్ అవుతుండగా.. 5జీబీ డేటా సేవలు అందుబాటులోకి వస్తే సెకనుకు 10 జీబీల డేటా ట్రాన్స్ ఫర్ చేయొచ్చని తెలుస్తోంది. ఈ సేవలతో ఇక ఫోన్లలో లేదా ఏ గ్యాడ్జెట్‌లో అయినా బఫరింగ్‌కు అవకాశమే ఉండబోదు. 


దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన 5జీ.. టెక్నాలజీ టెలికాం రంగంలో దూరదృష్టితో కూడిన సాంకేతిక అభివృద్ధి ప్రాజెక్ట్. 5G టెక్నాలజీ సిస్టమ్ భాగాల అభివృద్ధి, పరిశోధనలు, విస్తరణ అనేవి 6జీ టెక్నాలజీకి పునాదిలాంటివని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం సర్వీసెస్ సోమవారం ప్రకటనలో తెలిపింది. 


Also Read: RBI Tokenisation Deadline: క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ఆన్‌లైన్‌ పేమెంట్‌ నిబంధన గడువులో మార్పు.. ఆర్‌బీఐ ఏం చెప్పిందంటే?


Also Read: 28 Days Validity: అమ్మో.. 28 రోజుల వ్యాలిడిటీ వెనుక ఇంత కథా.. రూ.వేల కోట్ల ఆదాయం!


Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్‌ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్‌!


Also Read: Cyber Crime: మీ మొబైల్‌ ఫోన్‌ సేఫేనా! పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి


Also Read: డ్రగ్స్ కేసు భయంతో యువనటి ఆత్మహత్య.. అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంతో దారుణం.. చివర్లో ట్విస్ట్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి