సైబర్ నేరగాళ్లు కొత్త దారిలో వెళ్తున్నారు. చిన్న ఏమరపాటు కూడా మీ ఖాతాను ఖాళీ చేసే ఛాన్స్ ఉందంటున్నారు సైబర్‌ నిపుణులు. 


ఇన్నాళ్లూ ఓటీపీలు, డెస్క్‌టాప్‌లును టార్గెట్ చేసిన సైబర్‌ కేటుగాళ్లు ఇప్పుడు ఫోన్‌లపై పడ్డారు. రిమోట్‌ డెస్క్‌టాప్‌ యాప్‌ ద్వారా ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. 


ప్రముఖ కంపెనీల పేరుతో ఫేక్‌ వెబ్‌సైట్స్‌ క్రియేట్ చేసి దొంగదెబ్బ తీస్తున్నారు సైబర్‌ నేరస్తులు. తెలిసిన వెబ్‌సైట్సే కదా అని క్లిక్‌ చేసి మన వివరాలు ఇస్తే ఇక అంతే సంగతులు. మీకు తెలియకుండానే సైబర్‌ నేరస్తుల చేతికి మీ జుట్టు ఇచ్చేస్తారు. 


గత మూడు నెలలుగా ముంబైలో ఇరవైకి పైగా కేసులు ఇలాంటివే రిజిస్టర్ అయ్యాయి. ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్న కేసుల వివరాలు చూస్తున్న అధికారులు విస్తుపోతున్నారు. ఈ కేసుల్లో నిందితులను కనిపెట్టడం చాలా సమస్యగా మారింది. 


ఆన్‌లైన్‌లో వస్తువులు బుక్‌ చేసేవాళ్లు... వర్క్‌ఫ్రమ్‌ హోం చేసేవాళ్లే ఈ సైబర్‌ నేరగాళ్ల టార్గెట్. ఏదో కారణంతో వాళ్లకు ఫోన్ చేసి ఏదో ప్రముఖ కంపెనీ పేరు చెప్పి వాళ్ల వాళ్ల మొబైల్స్‌లో ఎనీడెస్క్‌ యాప్‌ డౌన్‌లోడ్ చేపిస్తున్నారు. అక్కడి నుంచి దోపిడీ కథా చిత్రం స్టార్ట్ చేస్తున్నారు. సామాన్యులకు సినిమా చూపిస్తున్నారు. 

ఓ పెద్దాయనకు ఓ ప్రముఖ టెలికం కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. సిమ్‌కార్డు ఎక్స్‌పయిరీ అయిందని  పది రూపాయలతో రీఛార్జ్ చేస్తే సరిపోతుందన్నారు. బ్యాంకు వివరాలు ఇస్తే తామే ప్రోసెస్ పూర్తి చేస్తామన్నారు. దీని కోసం ఓ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని లింక్ పంపించారు. అంతే ఆ లింక్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న ఆ పెద్దాయన ఖాతా ఖాళీ చేశారు. పది విడతలుగా లక్షరూపాయలు డ్రా చేశారు. 


ఇంకో రిటైర్డ్‌ ఉద్యోగి రీసెంట్‌గా ఆన్‌లైన్‌లో కార్డ్‌లెస్‌ ఫోన్‌ ఆర్డర్ చేశారు. ఆర్డర్‌ వచ్చిన మరుసటి రోజే ఆయనకో కాల్‌ వచ్చింది. ఆర్డర్ చేసిన కంపెనీ నుంచి ఫోన్‌ చేస్తున్నామని పరిచయం చేసుకున్నారు. ఆఫర్‌లో భాగంగా బుక్‌ చేసిన వస్తువుపై కొంత నగదు తిరిగి వస్తుందని బ్యాంకు వివరాలు చెప్తే వేస్తామని బురిడీ కొట్టారు. ఆయనతో ఎనీ డెస్క్‌ యాప్‌ డౌన్‌ లోడ్ చేయించారు. అందులో తన బ్యాంకు వివరాలు సదరు వ్యక్తి  ఎంటర్ చేశారు. ఇలా ఎంటర్ చేసిన పదిహేను నిమిషాల్లోపే ఆయన ఖాతాలోని లక్షా యాభై వేలు ఖాళీ చేశారు. ఇవన్నీ వివిధ ఫార్మాట్‌లలో తీసుకున్నారు. 


ఇంకో  మహిళ తన చుట్టూ ఉన్న ఓ కొరియర్ సంస్థ కోసం గూగుల్‌ వెతికారు. రాజస్థాన్‌లో ఉన్న ఫ్రెండ్‌కు కొరియర్ చేయడానికి గూగుల్‌ చేశారు. అందులో ఓ కొరియర్ సంస్థ పేరుతో వెబ్‌సైట్ కనిపించింది. అందులో ఉన్న నెంబర్‌కు ఫోన్ చేశారామె. ఒక ఆన్‌లైన్‌ ఫాం వచ్చింది. అది ఫిల్‌ చేసిన ఆమె.. బ్యాంకు వివరాలు అడిగితే తన భర్త బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చారు. వెంటనే ఆమె ఫోన్‌కు ఎనీ డెస్క్ లింక్ వచ్చింది. ఆ యాప్ ఇన్‌స్టాల్‌ చేసుకున్న ఆమె అక్కడ కూడా పూర్తి డిటేల్స్ ఇచ్చారు. వెంటనే భర్త ఖాతా నుంచి 20వేలు లాగేశారు. వెంటనే బ్యాంకు అధికారులకు ఫోన్ చేసి ఖాతాను బ్లాక్ చేశారు. లేకుంటే మొత్తం ఖాళీ అయ్యి ఉండేది. 


ఓ డాక్టర్‌ సోనీ లైవ్‌ టీవీని సబ్‌స్క్రైబ్ చేశారు. కానీ యాక్సిస్ లేదని ఏం చేయాలో తెలియక ఇంటర్‌నెట్‌లో సెర్చ్‌ చేశారు. సోనీలైవ్‌ కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ దొరికింది ఫోన్ చేస్తే ఎనీ డెస్క్‌ యాప్‌ డౌన్‌ లోడ్ చేసుకోవాలని చెప్పారు. అలా చేసి సుమారు అరవై వేలు కొట్టేశారు. 
ఎనీ డెస్క్‌ యాప్ కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు మాత్రమే ఇంటర్నల్‌ పర్పస్‌ వాడుతున్నారని... వ్యక్తిగతంగా దీన్ని యూజ్ చేయొద్దని పోలీసులు రిక్వస్ట్ చేస్తున్నారు. ఎవరైనా అలాంటి లింక్స్ పంపిస్తే మాత్రం క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు. 


Also Read: Tesla Smartphone: క్రేజీ ఎలన్‌ మస్క్‌! టెస్లా నుంచి మొబైల్‌ ఫోన్‌.. ఫీచర్లు ఇవే!!


Also Read: Multibagger Stock: 19 నెలల్లో రూ.లక్షకు రూ.20 లక్షల లాభం ఇచ్చే మల్టీబ్యాగర్‌


Also Read: Cryptocurrency Prices Today: రూ.3 లక్షల కోట్లు తగ్గిన బిట్‌కాయిన్‌, ఎథిరియమ్‌ విలువ.. మిగతావీ??


Also Read: Medplus IPO: మెడ్‌ప్లస్‌ లిస్టింగ్‌ సూపర్‌హిట్‌.. లాట్‌కు లాభం ఎంతొచ్చిందంటే?


Also Read: Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త కారు వచ్చేస్తుంది... వావ్ అనిపించే లుక్, డిజైన్లు


Also Read: PAN card Update: పెళ్లైన తర్వాత పాన్‌ కార్డులో ఇంటి పేరు మార్చుకోవాలా..? ఇలా చేయండి.