Australia Won Ashes Series: ఆస్ట్రేలియా జట్టు మరోసారి అద్భుతం చేసింది. బాక్సింగ్ డే టెస్టును ఆతిథ్య ఆసీస్ జట్టు కేవలం రెండున్నర రోజుల్లోనే పూర్తి చేసింది. ఇంగ్లాండ్ జట్టును రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 68 పరుగలకే ఆలౌట్ చేయడం ద్వారా ఇన్నింగ్స్ 15 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టు మూడో టెస్టులో విజయం సాధించింది. తద్వారా ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్‌ క్రికెట్ జట్టుపై 3-0 తేడాతో సొంతం చేసుకుంది.


రెండో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్​లో 4 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసిన ఇంగ్లాండ్ జట్టు మూడో రోజు ఆటలోనూ తడబాటుకు లోనైంది. ఆసీస్ అరంగేట్ర పేసర్ స్కాట్ బోలాండ్ సంధించిన బంతులకు ఇంగ్లాండ్ ఆటగాళ్ల వద్ద సమాధానం లేకపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో బోలాండ్ బంతితో నిప్పులు చెరిగాడు. కేవలం 7 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడంటే ఆసీస్ పేసర్ బోలాండ్ ఏ స్థాయిలో చెలరేగాడో అర్థమవుతోంది. ఇదివరకే తొలి రెండు టెస్టుల్లో ఓటమిపాలైన ఇంగ్లాండ్ జట్టు మూడో టెస్టులోనూ దారుణ ఓటమిని చవిచూసింది. బ్యాట్స్‌మెన్ వైఫల్యం ఆ జట్టుకు మరో ఓటమి రుచి చూసేలా చేసింది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఆసీస్ జట్టు నిలుపుకుంది.







22 పరుగులకే నాలుగు వికెట్లు హమీద్ (7), క్రాలే (5), మలన్ (0), జాక్ లీచ్ (0) వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ చివరి 6 వికెట్లను మరో 46 పరుగులు జోడించి కోల్పోయింది. కెప్టెన్ జో రూట్, ఆల్​రౌండర్ బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ జట్టును ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించలేకపోయారు. అయితే వన్డే ప్రపంచ కప్ నెగ్గిన ఇంగ్లాండ్ జట్టు ఆ తరువాత చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్‌ను వరుస టెస్టుల్లో ఓటమితో కోల్పోవడాన్ని ఇంగ్లాండ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.







స్కోర్ల వివరాలు..
తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లండ్ జట్టు 185 పరుగులకు ఆలౌట్
ఆసీస్ 267 పరుగులకు ఆలౌట్ (మొదటి ఇన్నింగ్స్​లో 82 పరుగుల ఆధిక్యం)
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులకు ఆలౌట్.. తద్వారా ఇన్నింగ్స్ 13 పరుగుల తేడాతో ఘోర పరాభవం


Also Read: Sreesanth, Ranji Trophy: జెర్సీలో నానీ అరిచినట్టే..! శ్రీశాంత్‌ భావోద్వేగం


Also Read: IND vs SA, Hanuma Vihari left: మా తెలుగు ఆటగాడు చేసిన తప్పేంటి? టీమ్‌ఇండియాపై విమర్శల వర్షం!!


Also Read: England Ducks 2021: అమ్మబాబోయ్.. అన్ని డకౌట్లా.. అత్యంత చెత్త రికార్డు సాధించిన ఇంగ్లండ్! 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి