క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల టోకెనైజేషన్‌ తుది గడువును భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) మరోసారి పొడగించింది. 2022, జనవరి 1కి బదులుగా 2022, జులై 1 నుంచి ఈ ప్రక్రియ అమల్లోకి వస్తుందని ప్రకటించింది. టోకెనైజేషన్‌ అమల్లో ఇంకా సవాళ్లు ఉన్నాయని, అనువైన సాంకేతిక, వాతావరణం ఏర్పడలేదని  బ్యాంకులు, మర్చంట్స్‌ సంఘాలు ఆర్‌బీఐకి తెలిపాయి. గడువు పొడగించాలని విజ్ఞప్తి చేశాయి.


టోకెనైజేషన్‌ అమలు గురించి 2020, మార్చి 17న కొత్త నిబంధన గురించి ఆర్‌బీఐ మర్చంట్స్‌, బ్యాంకులకు తెలియజేసింది. ఇందుకు సంబంధించి డిసెంబర్‌ 23న కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసింది. '2022, జూన్‌ 30 నుంచి క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల సమాచారం భద్రపరచడాన్ని నిషేధిస్తున్నాం. పేమెంట్‌ అగ్రిగేటర్లు, పేమెంట్‌ గేట్‌వేలు, నాన్‌ బ్యాంక్‌ పేమెంట్‌ అగ్రిగేటర్లు, మర్చంట్స్‌కు మార్గదర్శకాలు జారీ చేస్తున్నాం. పరిశ్రమలోని భాగస్వాముల విజ్ఞప్తి మేరకు తుది గడువును 2021, డిసెంబర్‌ 31 నుంచి పొడగిస్తున్నాం' అని ఆర్‌బీఐ తెలిపింది. 


టోకెనైజేషన్‌ తుది గడువును డిసెంబర్‌ 31 నుంచి మరికొంత కాలం పెంచాలని మర్చంట్‌ పేమెంట్స్‌ అలియన్స్‌ ఆఫ్ ఇండియా (MPAI), అలియన్స్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఇండియా ఫౌండేషన్‌ (ADIF) ఆర్‌బీఐని ఇంతకు ముందే కోరాయి. నిర్వహణ పరమైన సవాళ్లతో టోకెనైజేషన్‌ పరివర్తన ఆలస్యమవుతుందని పేర్కొన్నాయి. బ్యాంకులు సహా మర్చంట్స్‌, చెల్లింపుల పరిశ్రమ ఇంకా ఇందుకు సిద్ధంగా లేవని అన్నాయి.


టోకెనైజేషన్‌ లావాదేవీలు చేపట్టేందుకు నిలకడైన ఏపీఐ ప్రక్రియ అవసరమని ఎంపీఏఐ, ఏడీఐఎఫ్‌ తెలిపాయి. ఆర్‌బీఐ నిబంధనలు అమలు చేసేందుకు ఇంకా సమయం పడుతుందని, స్టేక్‌హోల్డర్లు అంతా సిద్ధమవ్వాల్సి ఉందని పేర్కొన్నాయి. కట్టుదిట్టంగా ఇప్పుడే అమలు చేసేందుకు ప్రయత్నిస్తే టోకెనైజేషన్‌ ప్రక్రియ విజయవంతం అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని వెల్లడించాయి.


టోకెనైజేషన్‌ ఇలా పనిచేస్తుంది
మీరు లావాదేవీలు చేపట్టేటప్పుడు డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు వివరాలను నమోదు చేస్తుంటారు. కార్డు మీదున్న 16 అంకెలు, కార్డు ఎక్స్‌పైరీ డేట్‌, సీవీవీ, ఓటీపీ, పిన్‌ వివరాలు ఎంటర్‌ చేస్తుంటారు. అవన్నీ సరిగ్గా ఉంటేనే లావాదేవీ చెల్లుతుంది. ఈ ప్రకియనంతా ఇకపై టోకెనైజేషన్‌ భర్తీ చేస్తుంది. ఇందుకు మీ కార్డు వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు. బదులుగా మీ కార్డుకు సంబంధించిన టోకెన్‌ను నమోదు చేస్తే చాలు.


Also Read: Tesla Smartphone: క్రేజీ ఎలన్‌ మస్క్‌! టెస్లా నుంచి మొబైల్‌ ఫోన్‌.. ఫీచర్లు ఇవే!!


Also Read: Multibagger Stock: 19 నెలల్లో రూ.లక్షకు రూ.20 లక్షల లాభం ఇచ్చే మల్టీబ్యాగర్‌


Also Read: Cryptocurrency Prices Today: రూ.3 లక్షల కోట్లు తగ్గిన బిట్‌కాయిన్‌, ఎథిరియమ్‌ విలువ.. మిగతావీ??


Also Read: Medplus IPO: మెడ్‌ప్లస్‌ లిస్టింగ్‌ సూపర్‌హిట్‌.. లాట్‌కు లాభం ఎంతొచ్చిందంటే?


Also Read: Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త కారు వచ్చేస్తుంది... వావ్ అనిపించే లుక్, డిజైన్లు


Also Read: PAN card Update: పెళ్లైన తర్వాత పాన్‌ కార్డులో ఇంటి పేరు మార్చుకోవాలా..? ఇలా చేయండి.