సాధారణంగా మనం మొబైల్ లేదా కంప్యూటర్ నుంచి మెసేజ్, మెయిల్ పంపాలంటే చేతి వేళ్లతో కంపోజ్ చేస్తాం. కానీ, ఈ పెద్దాయన మాత్రం మన టైపు కాదు. ఆయన మెదడుతోనే మెసేజ్‌లు కొట్టేస్తాడు. ఆయన మైండ్‌లో అనుకొనేవి నేరుగా ట్విట్టర్‌లో అక్షరాల రూపంలో ప్రత్యక్షమవుతాయి. ఇది మాయా కాదు.. మంత్రం కాదు.. ఇదో అద్భుతమైన టెక్నాలజీ. కానీ, అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే, ఆస్ట్రేలియాకు చెందిన ఈ పెద్దాయన గురించి తెలుసుకోవల్సిందే. 


ఫిలిప్ ఓకిఫే అనే 62 ఏళ్ల వ్యక్తి అంయోట్రోఫిక్ లాటరల్ సకిరోసిస్ (Amyotrophic Lateral Sclerosis - ALS) అనే వ్యాధి వల్ల పక్షవాతానికి గురయ్యాడు. దీనివల్ల ఆయన కాళ్లు చేతులు పనిచేయవు. కనీసం వేళ్లు కూడా కదపలేడు. కానీ, ట్విట్టర్లో మాత్రం తన మనసులో మాటను పోస్ట్ చేయగలడు. ఇందుకు ఆయన మెదడులో ఏర్పాటు చేసిన బ్రెయిన్ ఇంప్లాంటే కారణం. అందులో ఏర్పాటు చేసిన చిన్న కంప్యూటర్ చిప్ సాయంతో ఆయన ఈ ట్వీట్లు చేస్తున్నారు. 


డిసెంబరు 23న ఫిలిప్ మెదడులోకి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ (BCI) అనే స్టెంట్రోడ్‌ను ప్రవేశపెట్టారు. దానివల్ల ఆయన ప్రత్యేకంగా మాట్లాడటం లేదా శబ్దాలు, స్పెల్లింగ్స్ చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని ఆలోచిస్తే చాలు.. వెంటనే ట్విట్టర్‌లో పోస్టవుతుంది. ఈ టెక్నాలజీని న్యూరోవాస్కులర్ బయోఎలక్ట్రానిక్స్ మెడిసిన్ కంపెనీ Synchron సంస్థ తయారు చేసింది. ఈ సందర్భంగా ఆ సంస్థ సీఈవో థామస్ ఓక్స్‌లే ట్విట్టర్‌ అకౌంట్‌లో.. ఫిలిప్ ఆలోచన నుంచి పుట్టిన ట్వీట్ ఒకటి పోస్టయ్యింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ టెక్నాలజీతో కేవలం ట్వీట్లు మాత్రమే కాదు.. ఇ-మెయిల్, పలు కంప్యూటర్ గేమ్స్ ద్వారా కూడా ఫిలిప్ మెసేజులు పంపగలడు. 


Also Read: ప్రేమ ‘గాయం’.. యాసిడ్ దాడి చేసిన వ్యక్తినే ప్రేమించి పెళ్లాడిన యువతి, చివరికి ఊహించని ట్విస్ట్...


ఫిలిప్ మాట్లాడుతూ.. ‘‘ఈ సిస్టమ్ చాలా ఆశ్చర్యం కలిగింది. అయితే, మన ఆలోచనలను అక్షరాలుగా మార్చాలంటే కాస్త అభ్యాసం అవసరం. అంటే.. దాదాపు బైకు నేర్చుకున్నట్లుగా ఒక్కో అంశం మీద పట్టు సాధించాలి. కంప్యూటర్‌లో నేను ఎక్కడ క్లిక్ చేయాలని ఆలోచిస్తాను.. వెంటనే ఆ సిగ్నల్ నా మెదడులోని చిప్ ద్వారా కంప్యూటర్ స్వీకరిస్తుంది. అలా నేను ఇప్పుడు ఇ-మెయిల్, బ్యాంకింగ్, షాపింగ్ వంటివి కూడా చేయగలుగుతున్నాను. ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి సాంకేతాలు పంపించగలను’’ అని తెలిపారు. బ్రెయిన్ ద్వారా ఫిలిప్ చేసిన ట్వీట్స్ ఇవే..:










Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్


Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!


Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)


Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి