ఎవరికైనా ఆపద వస్తే 100కు డయల్ చేయండని పోలీసులు చెబుతారు. అయితే, చిన్న చిన్న కారణాలకు కూడా పోలీసులకు ఫోన్ చేస్తూ విసిగించే ఆకతాయిలు చాలామంది ఉంటారు. అయితే, ఈ యువతిది అమాయకత్వమో.. ఆకతాయితనమో తెలీదుగానీ.. బాయ్ ఫ్రెండ్ ముద్దు పెట్టడం లేదని తెలిసి పోలీసులకు కాల్ చేసింది. మరి, పోలీసులు ఆమెకు సాయం చేశారా? 


ఇంగ్లాండ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లింకన్‌షైర్‌కు చెందిన ఓ యువతి ఇటీవల స్థానిక పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్‌ 999కు కాల్ చేసింది. అందులో ఆమె చెప్పిన కారణం విని పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎదురుగా ఉంటే.. చాచి కొట్టేంత కోపం వచ్చింది. ఇంతకీ ఆమె ఫోన్లో ఏం చెప్పిందంటే.. ‘‘నా బాయ్‌ఫ్రెండ్ నాతో క్లోజ్‌గా ఉండటం లేదు. ముద్దు పెట్టమంటే పెట్టడం లేదు. అతడి మీద చర్యలు తీసుకోండి’’ అని చెప్పింది. దీంతో పోలీసులు.. ఎమర్జె్న్సీ నంబరును ఇలాంటి చిన్న చిన్న విషయాలకు వాడేయకూడదని హితవు పలికారు. మీరు ఏదైనా ఆపదలో ఉన్నా, మీ ఆస్తులకు నష్టం వాటిల్లే ప్రమాదం జరిగినా నెంబర్‌కు వెంటనే కాల్ చేయాలని, అప్పుడు పోలీసులు వచ్చి సాయం చేస్తారని.. ఇంకెప్పుడు ఇలాంటి ఆకతాయి పనులకు పాల్పడవద్దంటూ సున్నితంగా హెచ్చరించారు. 






ఈ ఘటనను ఉదాహరణకు చూపుతూ.. పోలీస్ ఎమర్జెన్సీ సర్వీస్ నంబర్లను దుర్వినియోగం చేయొద్దని తెలిపారు. దాని వల్ల పోలీసులకు టైమ్ వేస్ట్ అవుతుందని, ఆకాతాయి కాల్స్ వల్ల నిజంగా ఆపదలో ఉన్నవారు నష్టపోతారని వివరించారు. కొందరు రైళ్ల రాకపోకల వేళలు, వైద్యుల ఫోన్ నెంబర్ల కోసం కూడా తమకు కాల్ చేస్తున్నారని పోలీసులు వాపోయారు. చివరికి ఇంట్లో నీళ్లు రాకపోయినా తమకే కాల్ చేస్తున్నారని, ఎమర్జెన్సీ కాల్స్‌పై ప్రజలకు అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందన్నారు. వీళ్ల బాధపడలేక పోలీసులు ట్విట్టర్ ద్వారా కూడా సందేశమిచ్చారు. 


Read also: ఈ ఏడాది మనదేశంలో ఎక్కువ మంది వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే


Read also: వైరస్‌ల నుంచి రక్షణనిచ్చే ఎండు అంజీర్ పండ్లు... తినకపోతే మీకే నష్టం


Read also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి