గుంటూరులో జిన్నా పేరు మీద జిన్నాటవర్ కట్టారని వెంటనే ఆ పేరు మార్చాలి.. లేకపోతే కూల్చేయాలని బీజేపీ పిలుపునిచ్చింది. అంతే కాదు ముస్లిం పేర్లు ఎక్కడ ఉన్నా మార్చేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని.. కరీంనగర్ పేరును కూడా మారుస్తామని చెబుతున్నారు. అయితే అలామార్చడానికి ఇంకా ఆయా రాష్ట్రాల్లో అధికారం రాలేదు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వారికి చాయిస్ ఉంది కాబట్టి మార్చేస్తున్నారు. ఈ విషయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చాంపియన్‌గా ఉన్నారు. తాజాగా ఓ రైల్వే స్టేషన్ పేరును మార్చేశారు.
Also Read: ఆధ్యాత్మిక గురువు కాళీచరణ్ అరెస్ట్.. గాంధీపై అనుచిత వ్యాఖ్యలే కారణం
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ అనే నగరం గురించి తెలియని వారెవరూ ఉండరు. ఆ నగరం గురించి తెలియకపోయినా ఝాన్సీ అనే పేరు వింటే ప్రతి భారతీయుడికి ఓ ధీరవనిత కళ్ల ముందు మెదులుతుంది. ఇప్పుడు ఆ ఝాన్సీ పట్టణంలో ఉన్న ఝాన్సీ రైల్వే స్టేషన్ పేరును .. వీరాంగణ లక్ష్మీబాయ్ రైల్వేస్టేషన్‌గా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారికంగా ప్రకటించారు.
Also Read: యూపీ ఎన్నికలు యథాతథం.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన
మరికొద్ది రోజుల్లో అధికారికంగా ఉత్వర్వులు వెలువడనున్నాయి. దీనిపై ఇప్పటికే కేంద్రం నుంచి ఆమోదం కూడా లభించిందని యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.రైల్వేస్టేషన్ పేరు మార్పు ప్రతిపాదనలను యోగి ప్రభుత్వం మూడు నెలల క్రితం.. కేంద్ర హోంమంత్రిత్వశాఖకు పంపించింది. చట్టపరమైన అనుమతులు పూర్తయ్యాక.. అధికారికంగా రైల్వేస్టేషన్ కోడ్ మారుస్తారు.
Also Read: 'ఓవైపు మహిళలపై దారుణాలు.. మరోవైపు యోగి సర్కార్ మొద్దు నిద్ర'
ఇప్పటికే యోగి ప్రభుత్వం.. అలహాబాద్‌ను ప్రయాగ్ రాజ్‌గా, మొఘల్‌సరై రైల్వే స్టేషన్‌ను పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్‌గా, ఫైజాబాద్ రైల్వేస్టేషన్‌ను అయోధ్యకాంట్‌గా పేరు మారుస్తు నిర్ణయం తీసుకుంది. అయితే ఇవన్నీ ముస్లిం పేర్లు...కాబట్టి మార్చారు అనుకున్నా.. ఝాన్సీ అనే పేరు యోగి ఆదిత్యనాథ్‌కు ఎందుకు నచ్చలేదో చాలా మంందికి ఇంకా పజిల్‌గానే ఉంది.
Also Read: Petrol Price Cut Jharkhand: వాహనదారులకు గుడ్ న్యూస్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25 తగ్గింపు!