ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. యూపీలోని అమెఠీలో ఓ దళిత యువతి తమ ఇంట్లో చోరీ చేసిందనే ఆరోపణలతో కొందరు బాలిక పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఆమె జుట్టు పట్టుకొని లాక్కొచ్చి ఇంట్లో బంధించి.. హింసించారు. ఈ వీడియోను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ట్వీట్ చేశారు.
ఏం జరిగింది?
ఈ వీడియోలో ఓ ఇద్దరు వ్యక్తులు ఓ బాలికను నేలపైకి నెట్టేయగా.. మరో వ్యక్తి కర్రతో ఆమె అరికాళ్లపై విచక్షణారహితంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక ఆ బాలిక ఏడుస్తున్నా కనికరించలేదు. మరో ఇద్దరు మహిళలు.. బాలికలను దూషిస్తున్నారు. మరొకరు ఈ ఘటనను వీడియో తీస్తు పైశాచికంగా ప్రవర్తించారు. ఈ వీడియో వైరల్ కావడంతో అమెఠీ పోలీసులు నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు.
ఈ ఘటన ప్రస్తుతం యూపీలో తీవ్ర దుమారాన్ని రేపుతుంది. దీనిపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్వీటర్‌లో మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతుంటే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిద్రపోతుందన్నారు. 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపడుతుందని అల్టీమేటం జారీ చేశారు. ప్రియాంక గాంధీ.
వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలు యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై విమర్శలు చేస్తున్నాయి.
Also Read: Petrol Price Cut Jharkhand: వాహనదారులకు గుడ్ న్యూస్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25 తగ్గింపు!