స్మగ్లర్‌తో డ్రగ్స్ క్యాప్యూల్స్‌ను మింగిస్తారు. కడుపులో ఉంటే ఎవరూ గుర్తు పట్టరని అలా చేస్తారు. తర్వాత ఆ స్మగ్లర్‌ను పంపాలనుకున్న దేశానికి పంపారు. అక్కడ అసలు స్మగ్లర్లు అతన్ని రిసీవ్ చేసుకుని అడ్డగోలుగా అతని పొట్టను చీల్చి ఆ క్యాప్యూల్స్ తీసుకెళ్లిపోతారు. ఇది సూర్య హీరోగా వచ్చిన వీడొక్కడే అనే డబ్బింగ్ సినిమాలో సీన్లు. ఇదంతా మన సినీ రచయితల క్రియేటివిటీ అనుకుంటాం కానీ...ఇది రియాలిటీ. గతంలో జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి.
ఢిల్లీలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉగాండా నుంచి ఓ మహిళ వచ్చింది. ఆమె పొట్ట ఎత్తుగా ఉంది. కానీ ప్రెగ్నెంట్ కాదు. అందుకే అధికారులకు డౌట్ వచ్చింది. వెంటనే స్కానింగ్ చేస్తే పొట్టలో టాబ్లెట్లు కనిపించాయి. ఆ టాబ్లెట్లు ఎంటా అని తీస్తే.. కొకైన్ అని తేలింది. కకైన్‌ను చిన్న చిన్న క్యాప్సూల్స్‌లో నింపి వాటిలో కడుపులో నింపుకుంది. మొత్తం 91 క్యాప్యూల్స్ ఉన్నాయి. వీటి బరువు దాదాపుగా కేజీ ఉంది.
అయితే ఆమె స్మగ్లింగ్ చేయడానికి ప్రాణాలతోనే చెలగాటం ఆడుకుంది. ఆమె కడపులో ఉన్న కొకైన్‌ను బయటకు తీయడానికి డాక్టర్లే నానా తంటాలు పడాల్సి వచ్చింది. అత్యంత ప్రాణాపాయ స్థితి నుంచి ఆమె కోలుకుంది. ఆమెపై డ్రగ్స్ చట్టం కింద కేసు పెట్టి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె కూడా ఆ డ్రగ్స్ స్మగ్లింగ్‌లో ఓ పావు మాత్రమే. నిజానికి ఎవరు స్మగ్లింగ్ చేస్తున్నారు..ఎవరికి అందివ్వాలన్న విషయాలపై ఆమెకు కనీస మాత్రం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. దీంతో ఆమె కాంటాక్ట్స్ మీద అధికారులు దృష్టి పెట్టి.. ఎవరు ఆ డ్రగ్స్‌ను దిగుమతి చేయిస్తున్నారో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు..
న్యూ ఇయర్ వేడుకల కోసం ఢిల్లీలో పాటు దేశంలోని మెట్రో నగరాల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ కోసం పెడ్లర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. చివరికి పొట్టల్లో పెట్టి కూడా దిగుమతి చేస్తున్నారు స్మగ్లర్లు. ఒక్క కేజీ కొకైన్ రూ. ఇరవై కోట్లకుపైగానే ఉంటుంది. అందుకే ప్రాణాలకు తెగించి కొంత మంది ఆఫ్రికా నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు. ఉగాండా మహిళను పట్టుకున్నారు కాబట్టి తెలిసింది.. పట్టుకోకుండా ఎంత మంది బయటకు వెళ్లిపోయారో ఎవరికీ తెలియదు.
Also Read: Year Ender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం
Also Read: Year Ender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం