భారీగా పెరిగిన పెట్రోల్ ధరలతో విలవిల్లాడుతోన్న వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పారు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్. లీటర్ పెట్రోల్‌పై ఏకంగా రూ.25 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
వారికి మాత్రమే..
రాష్ట్రంలో జేఎంఎం ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ఈ మేరకు ప్రకటించారు.
అయితే ఈ అవకాశం కేవలం ద్విచక్రవాహనదారులకేనని స్పష్టం చేశారు. పెరిగిపోతోన్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. అందుకోసమే వారికి ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకున్నామన్నారు.
వచ్చే ఏడాది జనవరి 26 నుంచి ఇది అమలులోకి రానున్నట్లు హేమంత్ సోరెన్ తెలిపారు.
2 ఏళ్లు..
2019లో జరిగిన ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 81 స్థానాలకు గాను జేఎంఎం 30 స్థానాలు గెలుపొందగా, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1 స్థానం గెలుచుకున్నాయి. జేఎంఎం నేతృత్వంలోని కూటమే అధికారాన్ని చేపట్టింది. సీఎం హేమంత్ సోరెన్ బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు పూర్తయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు గాను పెట్రోల్ రేట్లు తగ్గించి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు.
Also Read: Omicron Cases In India: దేశంలో ఒమిక్రాన్ దడ.. 800కు చేరువలో మొత్తం కేసులు