విజయవాడ ప్రజాగ్రహ సభలో బీజేపీ నేతలు చేసిన విమర్శలపై వైఎస్ఆర్‌సీపీ నేత, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు అజెండానే బీజేపీ అమలు చేస్తోందని.. టీడీపీ అనుబంధ విభాగంగా బీజేపీ మారిందని విమర్శించారు. ఓ జాతీయ పార్టీ.. ప్రాంతీయ పార్టీకి అనుబంధంగా మారడం తొలి సారి చూస్తున్నామని ఎద్దేవా చేశారు. ఏపీ బీజేపీని చూస్తే జాలేస్తోందని వ్యాఖ్యానించారు. మాటలు సోము వీర్రాజువే కానీ స్క్రిప్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వనుంచే వస్తోందని.. చంద్రబాబు పొత్తు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారని మండిపడ్డారు.
Also Read: పవన్‌ను పదే పదే టార్గెట్ చేస్తున్న సోము వీర్రాజు ! బీజేపీ -జనసేన మధ్య దూరం పెరుగుతోందా ?
సీఎం జగన్ టార్గెట్‌గా బీజేపీ రాజకీయాలు చేస్తోందని.. అమరావతిని స్కామ్ రాజధాని అంటారు.. మూడేళ్లలో మళ్లీ రాజధాని కడతామంటున్నారని విమర్శించారు. టీడీపీ ఎంపీలు బీజేపీలోకి వెళ్లినా అనర్హతా వేటు వేయాలని ఎందుకు కోరరని సజ్జల ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఆధారాలు లేని ఆరోపణలతో అసత్యాల ప్రచారం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. బీజేపీ ప్రజాగ్రహ సభ మంగళవారం పూర్తయిన తర్వాత కూడా పీఆర్సీ అంశంపై మీడియాతో మాట్లాడిన సజ్జల బీజేపీపై మండిపడ్డారు.
Also Read: బ్రాహ్మణులే అర్చకత్వానికి అర్హులా..? తిరుపతిలో సుబ్రహ్మణ్య స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు !
బీజేపీలో ఉన్న టీడీపీ ఏజెంట్లే ప్రజాగ్రహ సభ ఏర్పాటు చేశారని.. దీని వెనుక ఉన్నది చంద్రబాబేనని అన్నారు.మామూలుగానే బీజేపీ పెద్దగా కనిపించదని, టీడీపీ కారణంగానే ఆ పార్టీ ఉనికిలో ఉందని వ్యాఖ్యానించారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఒకరో, ఇద్దరో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వాళ్ల వల్లే బీజేపీ ఏపీలో మనుగడ సాగిస్తోందని విమర్శించారు. బీజేపీలోనే కాదు, అటు జనసేన పార్టీలోనూ టీడీపీ వాళ్లే చక్రం తిప్పుతున్నారని సజ్జల విమర్శించారు. ఒక పార్టీ పల్లవి అందుకుంటే ఇంకో పార్టీ రాగం అందుకుంటుందని, రాజకీయంగా టీడీపీ ఏ పాట పాడితే బీజేపీ, జనసేన అదే పాట పాడుతుంటాయని ఎద్దేవా చేశారు. అంతే తప్ప విపక్షాలకు సొంత ఆలోచన లేదని విమర్శించారు. రామరాజ్యం కావాలంటే వైఎస్ఆర్‌సీపీని అనుసరించాలని ఏపీలో రామరాజ్యం నడుస్తోందని అన్నారు.
Also Read: కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్