దేశంలో కరోనా కేసులు పెరగడం, పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు విధించడం, కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లపై ఆంక్షలు పెడుతుండడంతో 'ఆర్ఆర్ఆర్' సినిమా చెప్పిన టైంకి రాదంటూ వార్తలు రావడం మొదలయ్యాయి. ఈసారి కూడా 'ఆర్ఆర్ఆర్' వాయిదా తప్పదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై దర్శకుడు రాజమౌళి క్లారిటీ ఇచ్చారని.. ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.
'ఆర్ఆర్ఆర్' సినిమా వాయిదా పడడం లేదని.. జనవరి 7న సినిమా విడుదలవుతుందని.. రాజమౌళి ఈ విషయాన్ని తనతో చెప్పినట్లు ట్విట్టర్ లో రాసుకొచ్చారు. దీంతో రాజమౌళి వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తుండడంతో దానికి తగ్గట్లుగానే భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ముంబై, చెన్నై, బెంగుళూరు ఇలా చాలా ప్రాంతాలకు తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
ముఖ్యంగా ముంబైలో ఓ రేంజ్ లో ప్రమోట్ చేశారు. హిందీ బిగ్ బాస్ షో, కపిల్ శర్మ కామెడీ షో ఇలా అన్నింటినీ సినిమా ప్రమోషన్స్ కోసం వాడేశారు రాజమౌళి. ఇప్పటివరకు ముంబై, చెన్నైలలో భారీ ప్రీరిలీజ్ ఈవెంట్స్ ను నిర్వహించారు. త్వరలోనే హైదరాబాద్ లోనే కూడా పెద్ద ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మించిన 'ఆర్ఆర్ఆర్'లో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Also Read:'ఆర్ఆర్ఆర్' నిర్మాత కష్టాలు.. బయ్యర్ల డిమాండ్స్ కి తలొంచుతారా..?
Also Read: 'ఇందువదన' ట్రైలర్.. ఇదొక హారర్ లవ్ స్టోరీ..
Also Read:2021 హయ్యెస్ట్ గ్రాసర్ 'పుష్ప'.. 'ఆర్ఆర్ఆర్' గనుక రాకపోతే.. నిర్మాత వ్యాఖ్యలు
Also Read: మెగాహీరోపై ఛార్జ్‌షీట్.. తేజ్ ని వదలని యాక్సిడెంట్ కేసు..
Also Read:సెల్ఫీ కోసం ఎగబడ్డ ఫ్యాన్స్.. ఫోన్లు పగలగొట్టండి అంటూ మంగ్లీ ఫైర్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి